https://oktelugu.com/

Bharateeyudu 2 Pre Release Event: ఆ ఇద్దరి వల్లే సిద్ధార్థ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడట…భారతీయుడు 2 తో మరో సారి కంబ్యాక్ ఇస్తాడా..?

సిద్ధార్థ్ మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే శంకర్ డైరెక్షన్ లో వస్తున్నా భారతీయుడు 2 సినిమా లో సిద్ధార్థ్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. నిజానికి సిద్ధార్థ్ చిన్నప్పటి నుంచి కమలహాసన్ సినిమాలను చూస్తూ పెరిగాడట. ఆ రకంగానే తను యాక్టర్ కావడానికి కమలహాసన్ ఆయనకి ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. అలాగే తను మొదటి నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన తనకు నచ్చిన ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ఆయన కమలహాసన్ పేరు చెబుతూనే వచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 08:39 AM IST

    Bharateeyudu 2 Pre Release Event

    Follow us on

    Bharateeyudu 2 Pre Release Event: బాయ్స్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సిద్ధార్థ్ హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమాతోనే ఆయన మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమాకి దర్శకుడు శంకర్ కావడం విశేషం.. ఆయన తీసిన తమిళ్ సినిమాని తెలుగులో బాయ్స్ పేరుతో డబ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించాయనే చెప్పాలి.

    ఇక అలాంటి సిద్ధార్థ్ ఆ తర్వాత తెలుగులో భారీ సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఇప్పుడు ఆయన మార్కెట్ అనేది చాలా వరకు తగ్గింది. కాబట్టి ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే శంకర్ డైరెక్షన్ లో వస్తున్నా భారతీయుడు 2 సినిమా లో సిద్ధార్థ్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. నిజానికి సిద్ధార్థ్ చిన్నప్పటి నుంచి కమలహాసన్ సినిమాలను చూస్తూ పెరిగాడట. ఆ రకంగానే తను యాక్టర్ కావడానికి కమలహాసన్ ఆయనకి ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. అలాగే తను మొదటి నుంచి కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన తనకు నచ్చిన ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ఆయన కమలహాసన్ పేరు చెబుతూనే వచ్చాడు.

    నిజానికి కమలహాసన్ నటనకి తను డై హార్డ్ ఫ్యాన్ అంటూ చెప్పాడు. ఇక భారతీయుడు 2 ఈవెంట్ లో తను మాట్లాడిన స్పీచ్ చాలా హైలెట్ గా నిలిచింది. ఇక అలాగే శంకర్ తనని మొదటిసారిగా హీరోగా పరిచయం చేశారన్నాడు. ఇక దాంతో తన కెరియర్ మారిపోయిందని చెప్పాడు. అలాగే ఇప్పుడు తన కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు మరోసారి తనకు మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చారని సిద్ధార్థ్ మాట్లాడాడు.

    ఇక వాళ్ళిద్దరి పట్ల తను కృతజ్ఞతలను తెలియజేస్తూ అటు కమలహాసన్, ఇటు శంకర్ ఇద్దరు లేకపోతే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు అంటూ వాళ్ల గురించి చాలా గర్వంగా చెప్పాడు. అలాగే కమలహాసన్ తో నటించాలని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అది ఇప్పటికీ నెరవేరింది అని చెప్పాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తుందని తను ఈ సినిమాతో మరోసారి మంచి కం బ్యాక్ ఇస్తానని చెప్పడం విశేషం…