https://oktelugu.com/

Bharateeyudu 2 Pre Release Event: కమలహాసన్ ను స్టార్ గా మార్చిన ఆ ముగ్గురు ఎవరో తెలుసా..? వాళ్ళు లేకపోతే ఆయన ఉండేవాడు కాదు…

ఈనెల 12వ తేదీన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్లో పాల్గొన్న కమలహాసన్ తన కెరియర్ గురించి చెబుతూ తను ఈ పొజిషన్ లో ఉండడానికి ఒక ముగ్గురు డైరెక్టర్స్ కారణం అయ్యారని చెప్పాడు. అందులో మొదటగా వాళ్ల గురువు ఆయన కే బాలచందర్ గారి పేరు చెప్పాడు. ఇక తనలో ఒక మంచి ఉన్నాడని గుర్తించి నటుడిగా తీర్చిదిద్ది మొత్తానికైతే ఆయన్ని ఉత్తమ నటుడిగా నిలబెట్టడని చెప్పాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 08:48 AM IST

    Bharateeyudu 2 Pre Release Event

    Follow us on

    Bharateeyudu 2 Pre Release Event: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కమలహాసన్ ఆ తర్వాత హీరోగా మారి సూపర్ సక్సెస్ లను అనుకున్నాడు. ఇక కమలహాసన్ తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించాడు. ఇక అందులో చాలా పాత్రలు ఆయనకు స్టార్ హీరోగా గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆయన చేసిన స్వాతిముత్యం, సాగర సంగమం, శుభసంకల్పం లాంటి సినిమాలు తెలుగులో అతన్ని స్టార్ హీరోగా మార్చడమే కాకుండా ఆర్ట్ సినిమాలని కమల్ హాసన్ తప్ప మరేవరు చేయలేరు అనేంత లా గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.

    ఇక ఇదిలా ఉంటే ఈనెల 12వ తేదీన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్లో పాల్గొన్న కమలహాసన్ తన కెరియర్ గురించి చెబుతూ తను ఈ పొజిషన్ లో ఉండడానికి ఒక ముగ్గురు డైరెక్టర్స్ కారణం అయ్యారని చెప్పాడు. అందులో మొదటగా వాళ్ల గురువు ఆయన కే బాలచందర్ గారి పేరు చెప్పాడు. ఇక తనలో ఒక మంచి ఉన్నాడని గుర్తించి నటుడిగా తీర్చిదిద్ది మొత్తానికైతే ఆయన్ని ఉత్తమ నటుడిగా నిలబెట్టడని చెప్పాడు.

    ఇక ఈయన తర్వాత కే విశ్వనాధ్ పేరు చెప్పారు. ఇక వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన స్వాతిముత్యం,సాగర సంగమం, శుభసంకల్పం లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈయన తర్వాత తనకు నచ్చిన డైరెక్టర్ శంకర్ ఈయన కమల్ కి భారతీయుడు లాంటి ఒక సూపర్ సక్సెస్ ని అందించారు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో టాప్ 3 లో నిలిచిపోయే సినిమాల్లో భారతీయుడు సినిమా కూడా ఒకటి.

    ఇక దానివల్ల ఆ సినిమాను ఆయనకు అందించిన శంకరంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పడం విశేషం… ఇక మొత్తానికైతే ముగ్గురు దర్శకులు అంటే ఇష్టం అని వాళ్ల వాళ్లే తను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్ననని చెప్పాడు…ఇక ఈ సినిమా తో కమల్ మరోక సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనేది చూడాలి…