Bharateeyudu 2 Pre Release Event: ఈ సినిమా కోసం కమలహాసన్ ఎవ్వరు చేయని రిస్క్ చేశాడు అంటున్న శంకర్…

మరోసారి ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించడానికి 'భారతీయుడు 2' సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే నిన్న ఏర్పాటుచేసిన భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ కమలహాసన్ గారి నటన అద్భుతం అని చెప్పాడు. అలాగే ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేది వాస్తవం.. ఇక 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ను చూసినప్పుడు ఎలాంటి గుస్ బంప్స్ అయితే వచ్చాయో భారతీయుడు 2 సినిమా సెట్ లో కమలహాసన్ గారు మరొకసారి సేనాపతి క్యారెక్టర్ లో కనిపించడంతో ఒక హై ఫీల్ అయితే వచ్చిందని చెప్పాడు.

Written By: Gopi, Updated On : July 8, 2024 8:28 am

Bharateeyudu 2 Pre Release Event

Follow us on

Bharateeyudu 2 Pre Release Event: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో సినిమాలను తీసి ఆ సినిమాలను తెలుగులో డబ్ చేసి తెలుగు తమిళ్ రెండు భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లను అందుకున్న దర్శకుడు శంకర్. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఆ సమయంలో అతనికి ఫ్లాప్ అనేది కూడా లేదు. ఇక మొత్తానికైతే శంకర్ ని మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు మరోసారి ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించడానికి ‘భారతీయుడు 2’ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే నిన్న ఏర్పాటుచేసిన భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ కమలహాసన్ గారి నటన అద్భుతం అని చెప్పాడు. అలాగే ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేది వాస్తవం.. ఇక 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ను చూసినప్పుడు ఎలాంటి గుస్ బంప్స్ అయితే వచ్చాయో భారతీయుడు 2 సినిమా సెట్ లో కమలహాసన్ గారు మరొకసారి సేనాపతి క్యారెక్టర్ లో కనిపించడంతో ఒక హై ఫీల్ అయితే వచ్చిందని చెప్పాడు.

ఇక దాంతో పాటుగా భారతీయుడు 2 సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఆ రోప్ ను పట్టుకుని షూట్ చేయాల్సి వచ్చిందట. అది కొంచెం ఇబ్బంది అయిన కూడా కమలహాసన్ ప్రాణాలకే ప్రమాదం జరిగేదట…దాదాపు నాలుగు రోజులు పాటు అదే సీన్ ను షూట్ చేశారట. ఇక దాంట్లో ఏమాత్రం డూప్ ను వాడకుండా కమలహాసన్ ఆ సీన్ లో తనే నటించి మెప్పించాడని శంకర్ చెప్పారు.

నిజంగా ఇది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఆయన నటన కోసం పుట్టిన వ్యక్తి కాబట్టి ఎలాంటి పాత్రనైనా చాలా ఈజీగా చేస్తూ అందులో నటించి మెప్పిస్తుంటాడు. ఇక ఎప్పుడు కష్టపడే మనిషి కాబట్టే ఆయన ఇప్పుడు ఈరోజు టాప్ పొజిషన్ లో ఉన్నాడు అంటూ శంకర్ కమలహాసన్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…