Shreyas Iyer : ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ సరికొత్తగా కనిపించాడు. దూకుడుగా ఆడాడు. కొన్ని సందర్భాల్లో సమయోచితంగా ఆడాడు. మొత్తంగా జట్టు కోసం అద్భుతంగా ఆడాడు. కొన్ని సందర్భాల్లో తూకం వేసినట్టు షాట్లు కొట్టాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆకాశమే హద్దుగా చెలగిపోయాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పంజాబ్ జట్టుకు ఐపీఎల్ లో నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో.. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా జట్టును ముందుకు నడిపిస్తున్న తరుణంలో.. చాలామందికి అతడిలో టీమిండియా కు కాబోయే భావి కెప్టెన్ కనిపించాడు. అయితే అటువంటి అయ్యర్ తేలిపోతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్లో సొంత మైదానంలో అనామక ఆటగాడిలా ఆడుతున్నాడు. ఒకసారి అలా జరిగితే దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడని అనుకోవచ్చు. ఈ సీజన్లో పంజాబ్ జట్టుకు సొంత మైదానమైన ముల్లన్ పూర్ లో అయ్యర్ నాలుగు సందర్భాల్లో తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. తద్వారా ప్రస్తుత ఐపిఎల్ లో సొంత మైదానంలో అత్యంత చెత్త స్కోర్ చేసిన కెప్టెన్ గా నిలిచాడు.
Also Read : ఫీల్డర్ ఫోర్ వెళ్లకుండా బంతిని ఆపాడు.. తిక్క రేగిన కోహ్లీ ఏం చేశాడంటే..
సొంత మైదానంలో దారుణం
పంజాబ్ జట్టుకు ముల్లన్ పూర్ సొంత మైదానంగా ఉంది. సాధారణంగా సొంతమైదానంలో ఏ జట్టు కెప్టెన్ అయినా సరే భారీగా పరుగులు తీస్తాడు. కానీ ముల్లన్ పూర్ లో మాత్రం అయ్యర్ దారుణంగా విఫలమవుతున్నాడు. పంజాబ్ జట్టు నాయకుడిగా.. గొప్పగా ఆడాల్సిన అతడు దారుణంగా అవుట్ అవుతున్నాడు. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ముల్లన్ పూర్ మైదానంలో నాలుగు ఇన్నింగ్స్ లు ఆడిన అతడు.. 25 పరుగులు మాత్రమే చేయడం విశేషం..ఈ మైదానంపై జరిగిన తొలి మ్యాచ్లో 10, రెండవ మ్యాచ్లో 9, మూడో మ్యాచ్లో 0, నాలుగో మ్యాచ్లో ఆరు పరుగులు మాత్రమే చేశాడు.. ఇక బయట మైదానంలో జరిగిన నాలుగు మ్యాచ్లలో మూడింట్లో 50+ పైగా పరుగులు అయ్యర్ చేయడం విశేషం. అయ్యర్ విఫల ఫామ్ పట్ల అభిమానులు విమర్శలు చేస్తున్నారు. సొంత మైదానంలో విఫలమవుతూ..శ్రేయస్ అయ్యర్ పరువు తీసుకుంటున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ” శ్రేయస్ అయ్యర్ గొప్ప ఆటగాడు. పరుగులు బాగా తీస్తాడు. కానీ ఈ ఐపీఎల్లో మాత్రం సొంతమైదానంలో విఫలమవుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు విఫలమయ్యాడు. ఇలా ఎందుకు అవుతున్నాడో అతడికే తెలియాలి.. ఇలాంటి చెత్త ఫామ్ కు అయ్యర్ ఫుల్ స్టాప్ పెట్టాలని” పంజాబ్ అభిమానులు కోరుతున్నారు. అయితే అయ్యర్ విఫలమైన సందర్భంలో పంజాబ్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది.. అయ్యర్ దూకుడుగా బ్యాటింగ్ చేసిన మ్యాచ్లలో భారీగా పరుగులు చేసింది.. ప్రత్యర్థి జట్ల ఎదుట భారీ టార్గెట్ ఉంచి విజయాలు సాధించింది.
Also Read : అర్జున్ రెడ్డి రేంజ్ లో విరాట్ కోహ్లీ..ఈ స్టార్ ఆటగాడికి ఏమైంది?