Shreyas Iyer: ఆ అమ్మాయి పై మనసు పడ్డా.. నన్ను దేకను కూడా దేక లేదు.. క్రికెటర్ నిర్వేదం..

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్.. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి హాజరయ్యాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 12, 2024 8:27 am

Shreyas Iyer

Follow us on

Shreyas Iyer: మనదేశంలో సినిమా తారలకు, క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వారిని చాలామంది దైవాంశ సంభూతులుగా పరిగణిస్తుంటారు. వారంటే చాలామంది పడి చస్తుంటారు. కానీ ఒక క్రికెటర్ కు ఇందుకు విభిన్నమైన పరిస్థితి ఎదురైంది. తను పేరుపొందిన క్రికెటర్ అయినప్పటికీ.. అతడిని ఆమె దేకను కూడా దేకలేదు. ఆమె అందానికి ముగ్ధుడై చివరికి అతడు హాయ్ చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ఆ క్రికెటర్ చెప్పుకుంటూ బాధపడ్డాడు..

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్.. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కపిల్ శర్మ అడిగిన ప్రశ్నలకు అయ్యర్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. అయితే ఈ షో ఆద్యంతం నవ్వులు పూయించింది. కపిల్ శర్మ హాస్య చతురతుతో కూడిన ప్రశ్నలు అడిగితే.. అయ్యర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.. ఒక మ్యాచ్ సందర్భంగా మైదానానికి వచ్చిన ఓ యువతి “అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా” అని ఫ్ల కార్డు ప్రదర్శించింది. దానిని వీడియో రూపంలో కపిల్ శర్మ ప్రదర్శించడంతో అయ్యర్ సిగ్గుల మొగ్గయ్యాడు. ఈ సందర్భంగా తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పాడు.

” అది నా తొలి ఐపిఎల్ సీజన్.. ఓ అందమైన అమ్మాయి ఆ మ్యాచ్ చూసేందుకు వచ్చింది. ఆమెను నేను ప్రేక్షకుల స్టాండ్స్ లో చూశాను. ఆ అమ్మాయి వైపు చేయి ఊపాను. ఆమెకు హలో కూడా చెప్పాను. అయితే ఆమె పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఫేస్ బుక్ వేదికగా నాకు ఏమైనా మెసేజ్ చేస్తుందేమోనని ఆశపడ్డాను. కానీ ఆ అమ్మాయి నుంచి నాకు ఎటువంటి సందేశం రాలేదు. ఆమె చాలా అందమైనది. చూస్తుంటే చూడాలనిపించేది. మైదానంలో ఆడుతున్నప్పటికీ నా ధ్యాస మొత్తం ఆమెపైనే ఉంది. ఒకవేళ ఆమె తిరిగి మెసేజ్ చేస్తే కచ్చితంగా ప్రేమలో ఉండేవాడిని.. కానీ నాకు ఆ అదృష్టం దక్కలేదు” అంటూ అయ్యర్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ షో కు హాజరైన ప్రేక్షకులు గట్టిగా అరిచారు.. అమ్మాయి ప్రస్తావన అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ తన ఆరాధ్య క్రికెటర్ అని చెప్పి.. ఉద్వేగానికి గురయ్యాడు. “రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అని నేను ఆ మాట చెప్పడం లేదని” అయ్యర్ వ్యాఖ్యానించాడు.. కాగా ప్రస్తుతం అయ్యర్ కోల్ కతా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. వరుస విజయాలతో పాయింట్లు పట్టికలో ఆ జట్టును రెండవ స్థానంలో నిలిపాడు.