Shreyas Iyer: ఐపీఎల్ లో పంజాబ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవల ఢిల్లీ జట్టు తో జరిగిన మ్యాచ్లో 264 పరుగుల టార్గెట్ కూడా ఈజీగా ఫినిష్ చేసింది. ఫలితంగా పంజాబ్ జట్టుకు ఐపిఎల్ లో ఎదురు అనేది లేకుండా పోతోంది. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా పంజాబ్ జట్టు ఓడిపోలేదు. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది పంజాబ్ జట్టు. పంజాబ్ జట్టు ప్లేయర్లలో ఓపెనర్లు ప్రబ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేపోతున్నారు. వీరికి కూపర్ కూడా సహకరిస్తున్నారు. దీంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా మారింది.
పంజాబ్ జట్టు గతంలో అంత గొప్పగా ఆడేది కాదు. ఎప్పుడైతే అయ్యర్ ఆ జట్టు సారధిగా వచ్చాడో.. అప్పుడే ఆ జట్టు రూపురేఖలు మొత్తం మారిపోయాయి. గత ఏడాది ఫైనల్ దాకా వెళ్ళింది పంజాబ్ జట్టు. అయితే ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో పంజాబ్ ఓడిపోయింది. అయితే ఈసారి మాత్రం అంతకుమించి అనే స్థాయిలో ఆడుతోంది. చివరికి బెంగళూరు జట్టును సైతం ఓడించే స్థాయికి పంజాబ్ ఎదిగింది.
బౌలింగ్ లో వైఫల్యాలు కనిపిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం పంజాబ్ జట్టు ప్లేయర్లు సింహా తాండవం చేస్తున్నారు. అందువల్లే వరుస విజయాలను పంజాబ్ జట్టు తన ఖాతాలో వేసుకుంటున్నది. పంజాబ్ జట్టు సాధిస్తున్న వరుస విజయాలు ఆ జట్టు యజమాని ప్రీతిజింటాకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ప్రీతి జింటా పంజాబ్ జట్టు యజమానుల్లో ఒకరు. తమ జట్టు ఆడుతున్నప్పుడు ప్రీతిజింట కచ్చితంగా మైదానానికి వస్తారు. తమ జట్టు ప్లేయర్లను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలిచిన తర్వాత.. పంజాబ్ ప్లేయర్లను ఆమె ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఇటీవల ప్రీతి జింటా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా తమ జట్టు గురించి అనేకమైన విషయాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా ఒక వ్యక్తి సర్పంచ్ సాబ్ గురించి ఒక మాట చెప్పండి అంటూ ప్రీతి జింటాను అడిగారు. దానికి ఆమె స్పందించారు.. ” అతడు స్ఫూర్తిని పెంపొందించుకున్న నాయకుడు. నిత్యం ప్రశాంతంగా ఉంటాడు. ఆ పిల్లలతో సరదాగా గడుపుతుంటాడు. నా పిల్లలు అతడిని భయ్యా అని పిలుస్తుంటారు. అతడిని ఇష్టపడుతుంటారు.” అని ప్రీతి పేర్కొంది.. తను ఓపెనింగ్ చేస్తానని యజువేంద్ర చాహల్ అడిగాడు.. దానికి ప్రీతి ఐపీఎల్ అయిన తర్వాత చూద్దామని వ్యంగ్యంగా బదులిచ్చింది.
