Shreyas iyer so angry Viral video : కీలకమైన దశలో కీలకమైన ప్లేయర్లు అవుట్ అయినప్పటికీ.. అతడు మాత్రం జట్టు కోసం గట్టిగా నిలబడ్డాడు. ఒక రకంగా జట్టు కోసం ఒంటరి పోరాటం చేశాడు. ఏమాత్రం భయపడకుండా.. వెనకడుగు అనేది వేయకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కీలకమైన సమయంలో వికెట్ కాపాడుకుంటూ.. చెత్త బంతులను మైదానం అవతలికి పంపిస్తూ తనదైన ప్రతీకారాన్ని ప్రదర్శించాడు. అందువల్లే ప్రీతి జింటా జట్టు విజయం సాధించింది. 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ వెళ్లిపోయింది. ఐపీఎల్ లో టేబుల్ టాపర్ గా ఉన్న అయ్యర్ జట్టు.. ట్రాఫిక్ కోసం జరిగే పోరులో ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. ఇక మంగళవారం జరిగే ట్రోఫీ పోరులో కన్నడ జట్టుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో కన్నడ జట్టుతో జరిగిన పోటీలో అయ్యర్ జట్టు ఓటమిపాలైంది.
అయ్యర్ ఆధ్వర్యంలో పంజాబ్ విజయం సాధించినప్పటికీ.. కీలక దశలో ఆ జట్టు ఆటగాడు శశాంక్ సింగ్ రన్ అవుట్ అయ్యాడు. ఒక రకంగా అతని నిర్లక్ష్యమే ఆ వికెట్ పోవడానికి కారణమైంది. ఆ దశలో ప్రీతి జింటా జట్టు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.. ఇదే క్రమంలో అయ్యర్ పై భారం పెరిగిపోయింది. ఆ సమయంలో అయ్యర్ స్థానంలో మరొక ఆటగాడు గనుక ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఓవైపు స్టోయినిస్ లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ.. అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితి తారుమారు అవుతుందని భావించి.. ముందుగానే అయ్యర్ జాగ్రత్తపడ్డాడు. అప్పటిదాకా లెక్కలు వేసుకుని ఆడిన అతడు.. ఒక్కసారిగా రెచ్చిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించి మరో మాటకు తావులేకుండా జట్టును విజయతీరాలకు మళ్లించాడు. తద్వారా తన జట్టును ఫైనల్ తీసుకెళ్లి దర్జాగా కాలర్ ఎగరేశాడు.
మ్యాచ్ గెలిచిన తర్వాత పంజాబ్ జట్టుపై విపరీతంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఒకానొక సందర్భంలో పంజాబ్ జట్టు ఓడిపోతుందా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే కీలకమైన ఆటగాళ్లు అవుట్ కావడంతో ఆ జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా భీకరమైన ఎదురుదాడికి దిగే శశాంక్ సింగ్ నిర్లక్ష్యంగా రన్ అవుట్ కావడం.. జట్టును ఒక రకమైన ఒత్తిడిలోకి నెట్టివేసింది. ఈ క్రమంలో అతడు రన్ అవుట్ అయినప్పుడు అయ్యర్ లో కోపం పెరిగిపోయింది. కాకపోతే దానిని అతడు బయటికి ప్రదర్శించలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత అయ్యర్ ను అభినందించడానికి పంజాబ్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా మైదానంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కరచాలనం ఇవ్వడానికి శశాంక్ తన వద్దకు రాగా.. అయ్యర్ దానికి ఇష్టపడలేదు.” రేయ్ నీ ముఖం నాకు చూపించకు.. నాకు ఎదురు పడకు.. నీకు ముందే చెప్తున్నా నాకు కోపంగా ఉంది” అని అయ్యర్ వ్యాఖ్యానించి ఉంటాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్లో ఉంది.