Shreyas Iyer Batting Ambani Reaction Viral Video “: ముంబై జట్టు అధిపతులుగా ఉన్న నీతా అంబానీ, ఆకాష్ అంబానీ ప్రతి మ్యాచ్ కు హాజరవుతారు. తమ జట్టు ప్లేయర్లు అద్భుతంగా ప్రదర్శన చేసినప్పుడు అభినందిస్తుంటారు. దానిని అక్కడితోనే ఆపి వేయకుండా.. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లను కొనియాడుతూ.. భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. అయితే ఈ సీజన్లో ప్రారంభంలో ఓటముల నుంచి వరుస విజయాలు సాధించి.. ఏకంగా ప్లే ఆఫ్ దాకా ముంబై వెళ్ళిందంటే దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ముంబై జట్టు ఆటగాళ్లు.. రెండవది ముంబై జట్టు యాజమాన్యం.. ముంబై జట్టు యాజమాన్యానికి కూడా పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ పై ఎటువంటి అపోహలు లేవు. పైగా తమ జట్టు గెలుస్తుందని వారిలో ప్రగాఢమైన నమ్మకం ఉంది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇంగ్లిస్ అవుట్ అయిన తర్వాత.. కచ్చితంగా తామే గెలుస్తామని ముంబై యాజమాన్యం అనుకుంది. ఇక మైదానంలో దగ్గరుండి మ్యాచ్ చూస్తున్న నేపథ్యంలో నీతా అంబానీ, ఆకాష్ అంబానీ కూడా దాదాపు తమ జట్టు గెలిచిందనే అభిప్రాయంలోకి వెళ్లిపోయారు. కానీ ఎప్పుడైతే అయ్యర్ నిలబడ్డాడో.. కీలక ఆటగాళ్లు అవుట్ అవుతున్నప్పటికీ బలమైన ఇన్నింగ్స్ నిర్మించాడో.. అప్పటినుంచి ముంబై యాజమాన్యం ముఖ కవళికలు పూర్తిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు చివర్లో ధారాళంగా పరుగులు ఇవ్వడంతో..నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ ఒక్కసారిగా తల పట్టుకున్నారు. అనవసరమైన ఓటమి ఎదురైందని ఆవేదన చెందారు. అయ్యర్ దంచి కొడుతుంటే నీతా అంబానీ, ఆకాష్ అంబానీ తల పట్టుకుని..ఇదేం శిరోభారం అంటూ తలలు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి..
Also Read : అశ్విని కుమార్ కు నిద్రలేని రాత్రులు.. అయ్యర్ విధ్వంసం అలా ఉంది మరి!
” ఏకు మేకయ్యాడు. మామూలుగా కాదు.. ముంబై జట్టును ఓడించాడు. గట్టిగా కొట్టాడు.. ముంబై యాజమాన్యం చూస్తుండగానే అదిరి పోయే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. అందువల్లే ముంబై యాజమాన్యం ఒక్కసారిగా ఆవేదన చెందింది. మైదానంలో అతడు కొడుతున్న దృశ్యాలు చూసి కలత చెందింది. బహుశా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ముంబై యాజమాన్యం ఊహించి ఉండదు.. పైగా ఈ మైదానంలో కూడా ముంబై జట్టుకు అత్యంత చెత్త రికార్డు ఉంది. అది నిజమని పంజాబ్ ప్లేయర్లు నిరూపించారు. ముఖ్యంగా అయ్యర్ ను ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టుకు కోలుకోలేని షాకిచ్చాడు. అందువల్లే ముంబై జట్టు ఒక్కసారిగా షాక్ లో కూరుకుపోయింది. ఇందులో నుంచి ఇప్పట్లో బయటపడుతుందా? లేదా?. అనేది చూడాల్సి ఉందని” భారత జట్టుకు చెందిన మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Reaction of the Ambanis after this six was Gold
Was absolute fun to watch!
— Jeya Suriya (@MSPMovieManiac) June 1, 2025