Shreyas Iyer comeback: బ్యాటింగ్ చేస్తాడు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు. ఆశలు మొత్తం అడుగంటిన సందర్భంలో తను ఒక్కడే నిలబడతాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్ మొత్తాన్ని లాక్కుంటాడు. అందువల్లే అతడిని ఈ కాలపు క్రికెట్ యోధుడు అని పిలుస్తుంటారు. వాస్తవానికి అతడు ఇతర జట్టులో గనుక ఉండి ఉంటే కచ్చితంగా కీలక స్థానాన్ని అందుకునేవాడు. నాయకుడిగా కూడా ప్రమోషన్ సాధించేవాడు. దురదృష్టవశాత్తు అతడికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. గొప్ప ఆటగాడు అయినప్పటికీ భారత జట్టులో స్థానం లభించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడి కెరియర్ తో ఆటాడుకుంటున్నది.. ఇంతకీ ఆ ఆటగాడు మరెవరో కాదు శ్రేయస్ అయ్యర్.
అయ్యర్ కోల్ కతా జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ఈ సీజన్లో పంజాబ్ జట్టును తుది పోరు వరకు తీసుకెళ్లాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపాడు. అంతకుముందు 2023లో పరిమిత ఓవర్లలో జరిగిన ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. అటువంటి ఆటగాడికి టీమ్ ఇండియాలో ఇప్పుడు చోటు దక్కడం లేదు. తెర వెనుక రాజకీయాలు.. రకరకాల పరిణామాలు అతని కెరియర్ మొత్తాన్ని డోలాయమానస్థితిలోకి నెడుతున్నాయి. అసలు ఈ స్థాయిలో ఉన్న ఆటగాడికి చోటు లభించకపోవడం పట్ల సీనియర్ల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతనితో ఎందుకు ఆడుకుంటున్నారని పరోక్షంగా విమర్శిస్తున్నారు.
ఇక తాజాగా అయ్యర్ కు ఆసియా కప్ లో కూడా చోటు లభించలేదు. దీనిపై మేనేజ్మెంట్ క్లారిటీ లేని సమాధానం చెప్పింది. అంటే కాదు అతనికి చోటు లభించకపోవడం పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించింది. అయితే త్వరలో ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే అనధికారిక టెస్ట్ మ్యాచ్ లలో భారత్ ఏ జట్టుకు అయ్యర్ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే అనధికారిక వన్డేలలో కూడా అయ్యర్ భారత జట్టును ముందుండి నడిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియాలో దీని సంబంధించిన వార్తలు విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై అయ్యర్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. బహుశా అదరి సేవలను ఈ విధంగా ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ ఇందులో గనుక అయ్యర్ తన ప్రతిభను నిరూపించుకుంటే.. పరిమిత ఓవర్లకు నాయకత్వ బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే ఇన్నాళ్లకైనా అయ్యర్ కు న్యాయం జరిగిందని అనుకోవచ్చు.