https://oktelugu.com/

India Vs Sri Lanka 2024: లంక టూర్ కు ముందు టీమిండియా కు షాకింగ్ న్యూస్.. టోర్నీకి దూరంగా ఆ ముగ్గురు..

కొంత కాలంగా తీరికలేని క్రికెట్ ఆడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఏస్ బౌలర్ బుమ్రా శ్రీలంకతో జరిగే 3 వన్డేల సిరీస్ కు దూరంగా ఉండనున్నారు. త్వరలో టెస్ట్ సీజన్ మొదలు కానుండడం, విశ్రాంతి తీసుకోవాలని కోరుకోవడం వల్లే.. వారు శ్రీలంక పర్యటనకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా టీమిండియాను నడిపించే అవకాశం కనిపిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 9, 2024 4:30 pm
    India Vs Sri Lanka 2024

    India Vs Sri Lanka 2024

    Follow us on

    India Vs Sri Lanka 2024: ప్రస్తుతం జింబాబ్వే టూర్ లో ఉన్న టీమిండియా.. ఆ తర్వాత శ్రీలంకలో పర్యటించనుంది. వచ్చే నెలలో శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలో ఆ టూర్ ప్రారంభానికి ముందే టీమిండియా కు షాక్ తగిలింది. టీమిండియాలో కీలక ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరంగా ఉండనున్నారు.

    కొంత కాలంగా తీరికలేని క్రికెట్ ఆడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఏస్ బౌలర్ బుమ్రా శ్రీలంకతో జరిగే 3 వన్డేల సిరీస్ కు దూరంగా ఉండనున్నారు. త్వరలో టెస్ట్ సీజన్ మొదలు కానుండడం, విశ్రాంతి తీసుకోవాలని కోరుకోవడం వల్లే.. వారు శ్రీలంక పర్యటనకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా టీమిండియాను నడిపించే అవకాశం కనిపిస్తోంది.

    35 సంవత్సరాల రోహిత్ శర్మ డిసెంబర్ – జనవరి నెలలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి మొదలు పెడితే మొన్నటి టి20 వరల్డ్ కప్ వరకు విరామం లేకుండా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. గత ఆరు నెలలుగా అతడు విశ్రాంతి తీసుకోలేదు. ఇక విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నాడు.. ఆ తర్వాత ఐపీఎల్, టి20 వరల్డ్ కప్ లో ఆడాడు. ఇక విరాట్ కోహ్లీ, ఇప్పటికే t20 లకు వీడ్కోలు పలికారు. లంకతో వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు ఆడుతుంది. ఆ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి ఎంట్రీ ఇస్తారు. అది పూర్తయిన తర్వాత న్యూజిలాండ్ తో టీమిండియా మూడు టెస్టులు ఆడుతుంది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టోర్నీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడుతుంది.

    రోహిత్, విరాట్, బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో వారి స్థానంలో కేఎల్ రాహుల్ తో పాటు యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ కు అవకాశం కల్పించాలని బీసీసీఐ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కూడా పలు కథనాలను ప్రసారం చేసింది. “ముగ్గురు కీ ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటున్నారు.. యంగ్ ప్లేయర్లకు ఆపర్చునిటీ దక్కుతుంది. వారు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదే చక్కటి అవకాశం.. ఎంతో పోటీ ఉన్న నేపథ్యంలో.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వారి స్థానం టీమిండియాలో పదిలంగా ఉంటుందని” జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొన్నది.