Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు ఏలిన హీరోల్లో రజనీకాంత్ ఒకరు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాడనే చెప్పాలి. రజనీకాంత్ ప్రస్తుతం వరుస డైరెక్రర్లను లైన్లో పెడుతున్నాడు. దాదాపు 80 సంవత్సరాలకు దగ్గర్లో ఉన్న ఈయన ఎక్కడ అలసిపోకుండా మంచి కసరత్తులు చేస్తూన్నాడు. ఇక ఈ సినిమాలను సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు.
గత సంవత్సరం జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ఈ ఇయర్ లో తను రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి వెట్టయాన్ అనే సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇక వీటితోపాటుగా మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా రజనీకాంత్ కు కథలు వినిపించడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఒకడు.
ఇక తెలుగు సినిమా దర్శకులు కూడా కొంతమంది రజనీకాంత్ తో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రజనీకాంత్ మాత్రం చాలా జాగ్రత్తగా కథలను సెలక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆయన రోజుకు చాలా కథలు విన్నపాటికి, అందులో కొందరికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రజనీకాంత్ స్టోరీ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఆయన సినిమాలకు సంబంధించిన జడ్జిమెంట్ ఆయనే తీసుకొని ఎవరితో సినిమా చేయాలి ఎవరితో చేయకూడదనే డెసిజన్ కి వస్తున్నట్లుగా తెలుస్తుంది…
ఇక తెలుగు దర్శకుడు అయిన వెంకీ అట్లూరి కూడా రజనీకాంత్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇక ఈయన గత సంవత్సరం ధనుష్ ను హీరోగా పెట్టి ‘సార్ ‘అనే సినిమా తీసి సక్సెస్ ను అందుకున్నాడు. కాబట్టి రజనీకాంత్ కి కూడా తను ఒక కథ వినిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి రజనీకాంత్ ఆ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…