Homeక్రైమ్‌Karnataka: 5 కోట్ల ఇన్సూరెన్స్ కోసం వ్యక్తిపై దారుణం.. తర్వాత అతి పెద్ద ట్విస్ట్.. ఇక్కడే...

Karnataka: 5 కోట్ల ఇన్సూరెన్స్ కోసం వ్యక్తిపై దారుణం.. తర్వాత అతి పెద్ద ట్విస్ట్.. ఇక్కడే దొరికారు

Karnataka: రూపాయి రూపాయి ఏం చేస్తావంటే.. మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాను.. ఆత్మీయతను చంపుతాను.. అనుబంధాలను నాశనం చేస్తాను అన్నదట.. ఓ సినిమాలో విశేషమైన ప్రాచుర్యం పొందిన మాట అది. ఆ మాటకు తగ్గట్టుగానే నేటి లోకం పోకడ ఉంది. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. విచక్షణ ను కోల్పోయి మృగాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. అలాంటిదే ఈ సంఘటన కూడా.

కర్ణాటక రాష్ట్రంలోని కౌలుపేట ప్రాంతంలో గంగాధర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు తన పేరు మీద 5.2 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ గ్యాంగ్.. గంగాధర్ తో మాటలు కలిపింది. అతడిని మచ్చిక చేసుకుంది.. అతడు చేసుకొన్న ఇన్సూరెన్స్ గురించి వివరాలు సేకరించింది. ఆ తర్వాత అతన్ని అంతం చేయించింది. అతడు ద్విక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. కారు తో గుద్దించింది. దీంతో గంగాధర్ అక్కడికక్కడే చనిపోయాడు. గంగాధర్ చనిపోయిన తర్వాత ఆ ముఠా అసలు నాటకాన్ని మొదలుపెట్టింది.. ఆ ముఠా లో ఓ మహిళను గంగాధర్ భార్యగా చిత్రీకరించింది. నకిలీ పత్రాలు సృష్టించింది.. ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ కూడా చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పోలీసులలో మేనేజ్ చేయడంలో ఈ ముఠా విఫలమైంది.

ఈ ఘటన జరిగిన తర్వాత విచారణ కోసం పోలీసులు గంగాధర్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమెను విచారించారు. ఆ విచారణలో గంగాధర్ కు టు వీలర్ లేదని తేలింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. అంతేకాదు గంగాధర్ పెద్దగా వాహనాలు నడపడం కూడా రాదని తెలపడంతో మరింత ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశారు. గంగాధర్ ను ఆ ముఠా అనుసరించిన తీరు.. వివరాలు రాబట్టిన తీరు పోలీసులు చేదించగలిగారు. ఆ తర్వాత గంగాధర్ కు నిత్యం ఆ ముఠా సభ్యులు ఫోన్ చేయడం.. ఆ కాల్స్ వివరాలను పోలీసులు సేకరించారు.. ఆ తర్వాత ఆ వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత.. మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేయడంతో ఆ ముఠా అసలు బాగోతం బయటపడింది. దీంతో వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ముఠాలోని సభ్యులు మొత్తం జైల్లో ఉన్నారు. ఈ ముఠా సభ్యులు గతంలో ఏమైనా దారుణాలకు పాల్పడ్డారా? ఇలాంటి ఘోరాలు ఏమైనా చేశారా? వీరి వెనుక ఎవరు ఉన్నారు? ఇన్సూరెన్స్ కంపెనీల బాధ్యులు ఎవరైనా ఉన్నారా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular