https://oktelugu.com/

IPL Most Fifties: ఫస్ట్ కోహ్లీ.. సెకండ్ శిఖర్ ధావన్.. థర్డ్ వార్నర్.. అరుదైన ఘనత

ఐపీఎల్ లో 50 అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్న రెండో భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు శిఖర్ ధావన్. ధావన్ కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విదేశాల నుంచి డేవిడ్ వార్నర్ 50 పైగా అర్థ సెంచరీలు సాధించిన తొలి విదేశీ ప్లేయర్ గా నిలిచాడు.

Written By:
  • BS
  • , Updated On : May 9, 2023 / 04:38 PM IST

    IPL Most Fifties

    Follow us on

    IPL Most Fifties: పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్, కీలక ఆటగాడు శిఖర్ ధావన్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ధావన్ మరో మైలురాయిని సాధించాడు. ఐపీఎల్ కెరియర్ లో 50వ అర్థ సెంచరీని పూర్తి చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుటున్నాడు.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సోమవారం సాయంత్రం కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ అర్థ సెంచరీని సాధించిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఒకవైపు వికెట్లు పడుతున్నా.. రెండో ఎండ్ లో శిఖర్ ధావన్ 47 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 57 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో 121.27 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు ధావన్.

    రెండో భారతీయ ఆటగాడిగా నిలిచిన ధావన్..

    ఐపీఎల్ లో 50 అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్న రెండో భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు శిఖర్ ధావన్. ధావన్ కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విదేశాల నుంచి డేవిడ్ వార్నర్ 50 పైగా అర్థ సెంచరీలు సాధించిన తొలి విదేశీ ప్లేయర్ గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే వార్నర్ అత్యధికంగా 57 అర్థ సెంచరీలను నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ లు 50కిపైగా అర్థ సెంచరీలు చేసి ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. డేవిడ్ వార్నర్ 57 అర్థ సెంచరీలతోపాటు, నాలుగు సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో సహా 55 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. శిఖర్ ధావన్ తన ఐపీఎల్ కెరియర్ లో రెండు సెంచరీలతో పాటు మొత్తం 52 అర్థ సెంచరీలు నమోదు చేశాడు.

    ఇది శిఖర్ ధావన్ ఘనత..

    శిఖర్ ధావన్ ఐపిఎల్ లో 35.93 సగటు, 127.16 స్ట్రైక్ రేటుతో 6,593 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరియర్ లో 106 అత్యుత్తమ స్కోర్ తో రెండు సెంచరీలు, 50కి పైగా అర్థ సెంచరీలను నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 7043 పరుగులు, డేవిడ్ వార్నర్ 6,211 పరుగులు చేశారు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు జాబితాలో ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. తాజా సీజన్ లో ఇప్పటి వరకు 58.16 సగటు, 143.62 స్ట్రైక్ రేట్ తో 349 పరుగులు చేశాడు. అతను ఈ సీజన్ లో మూడు అర్థ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది అత్యుత్తమ స్కోర్ 99 పరుగులు. 2023 లో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ అర్థ సెంచరీ, షారుక్ ఖాన్, హర్ ప్రీత్ బ్రార్ చేసిన అర్థ సెంచరీలతో పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో పంజాబ్ జట్టు 53 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్, జితేష్ శర్మ (21) 53 పరుగులు భాగస్వామ్యం నమోదు కావడంతో పంజాబ్ జట్టు మళ్లీ గేమ్ లోకి వచ్చింది. చివరి రెండు ఓవర్లలో షారుక్ (21), హార్ ప్రీత్ (17) కలిసి 36 పరుగులు సాధించారు. ఆఖరి ఓవర్ లో 21 పరుగులు వచ్చాయి. వీరిద్దరూ పంజాబ్ జట్టును పోరాడే స్థితికి స్కోరు బోర్డును చేర్చారు. అయితే కోల్కతా జట్టుకు ఈ మొత్తం సరిపోలేదు. కెప్టెన్ నితీష్ రానా అర్థ సెంచరీ, రస్సెల్, రింకూ సింగ్ ఆవేశపూరిత బ్యాటింగ్ తో కోల్కతా జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.