Shashank Singh Goosebumps Moment : పంజాబ్ జట్టులో శశాంక్ సింగ్ ఇటీవలి ఐపిఎల్ సీజన్లో అదరగొట్టాడు. కీలకమైన క్వాలిఫైయర్ -2 మ్యాచ్లో అతడు దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయినప్పటికీ.. చివరి అంచె పోటీలో మాత్రం అదరగొట్టాడు. ఎలాగైనా గెలుస్తామని ధీమాతో ఉన్న కన్నడ జట్టుకు చుక్కలు చూపించాడు. భారీ లక్ష్యాన్ని కూడా కరిగించి.. ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇంకో రెండు బంతులు గనుక ఉండి ఉంటే.. తనకు మరొక బ్యాటర్ కనుక సహకరించి ఉండి ఉంటే.. కచ్చితంగా శశాంక్ సింగ్ ప్రీతిజింతా జట్టుకు తిరుగులేని బహుమతి ఇచ్చేవాడు. శ్రేయస్ అయ్యర్ గౌరవాన్ని ఆకాశంలో నిలబెట్టేవాడు.. చివరి అంచె పోటీ తర్వాత.. శశాంక్ సింగ్ పై విపరీతమైన ప్రశంసలు కురిశాయి. అభినందనలు తామరతంపరగా వచ్చాయి. అయితే శశాంక్ సింగ్ ఇటీవల మీడియాతో పంచుకున్న ఒక విషయం మాత్రం విపరీతమైన చర్చకు కారణమవుతోంది. అతడిని హీరోని చేస్తోంది.
Also Read : తొక్కిసలాట ఘటనపై హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
ముఖ్యంగా హార్దిక్ జట్టుతో క్వాలిఫైయర్ -2 లో ప్రీతి జింటా జట్టు తలపడినప్పుడు.. శశాంక్ సింగ్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. వాస్తవానికి అతని మీద అయ్యర్ కు ఎన్నో ఆశలు ఉన్నాయి. మరో ఎండ్ లో తను ఉన్నప్పటికీ.. శశాంక్ సింగ్ తన మీద ఉన్న భారాన్ని తగ్గిస్తాడని అయ్యర్ భావించాడు. కానీ అనుకోకుండా శశాంక్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో అయ్యర్ లో కోపం పెరిగిపోయింది. కానీ అతడు అప్పుడు ప్రదర్శించలేదు. ఆ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలిచిన తర్వాత.. అయ్యర్ కు అందరూ ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలియజేస్తుంటే.. మనస్ఫూర్తిగా స్వీకరించాడు. ఎప్పుడైతే శశాంక్ తన వద్దకు వచ్చాడో అప్పుడు అయ్యర్ ముఖం చాటేసాడు.. అది మీడియాలో ప్రముఖంగా కనిపించింది. అయితే దీనిపై శశాంక్ సింగ్ ఇన్నాళ్లకు నోరు విప్పాడు.. నాడు అయ్యర్ చేసింది సరైన పనేనని.. తను అలా అవుట్ అయినప్పుడు ఏ కెప్టెన్ అయినా అలానే చేస్తాడని శశాంక్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నేను చేసిన తప్పుకు అయ్యర్ చెంప దెబ్బ కొట్టి ఉంటే బాగుండేదని శశాంక్ పేర్కొన్నాడు.. ఆ సమయంలో నాతో మాట్లాడక పోయినప్పటికీ.. కొంత సమయం గడిచిన తర్వాత నన్ను భోజనానికి అయ్యర్ తీసుకెళ్లాడని శశాంక్ వెల్లడించాడు.
చేసిన తప్పును శశాంక్ తెలుసుకున్నాడు కాబట్టి.. తనకు ఎటువంటి శిక్ష పడాలో వెల్లడించాడు. తన చెంప మీద అయ్యర్ కొడితే బాగుండేదని వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యల ద్వారా ఒకసారిగా హీరో అయిపోయాడని.. అతడిలో డౌన్ టు ఎర్త్ వ్యక్తిత్వం కనిపిస్తోందని నెటిజన్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. శశాంక్ సింగ్ కు ఉజ్వలమైన క్రీడా జీవితం ఉందని పేర్కొంటున్నారు.