Ram Charan next movie with Trivikram : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ‘పెద్ది'(Peddi Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుతుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే పూర్తి కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘పుష్ప’ చిత్రం విడుదల తర్వాత ఎంత ఫేమస్ అయ్యిందో, పెద్ది చిత్రం కేవలం గ్లింప్స్ వీడియో తోనే అంతకు మించి పాపులర్ అయ్యింది. ‘గేమ్ చేంజర్’ చిత్రం చేసిన గాయాన్ని ‘పెద్ది’ చిత్రం కచ్చితంగా నయం చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్(Sukumar) తో ఒక సినిమా చేస్తాడని మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమిటంటే రామ్ చరణ్ సుకుమార్ సినిమా కంటే ముందు త్రివిక్రమ్(Trivikram Srinivas) తో సినిమాని మొదలు పెడతాడని తెలుస్తుంది.
ఎందుకంటే సుకుమార్ మూవీ స్టోరీ, స్క్రిప్ట్ ,ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేయడానికి ఏడాది సమయం కోరాడాట. పెద్ది చిత్రం అక్టోబర్ లో రెడీ అయిపోతుంది. ఆ తర్వాత సంవత్సరం రోజులు ఖాళీగా ఉండాల్సి ఉంటుందని రామ్ చరణ్ త్రివిక్రమ్ తో ఒక సినిమాని ప్లాన్ చేసే పనిలో పడ్డాడట. ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసిందో మరెవరో కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది. త్రివిక్రమ్ తో సినిమా అంటే మన అందరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలే గుర్తుకు వస్తాయి. కానీ ఇది ఫ్యామిలీ జానర్ సినిమా కాదట. కొంపదీసి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాలని అనుకున్న మైథలాజికల్ మూవీ ని రామ్ చరణ్ తో చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు.
కానీ ఆ ప్రాజెక్ట్ కి రామ్ చరణ్ కి ఎలాంటి సంబంధం లేదట. కేవలం రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్న యాక్షన్ జానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అంటున్నారు. త్రివిక్రమ్ కి సంబంధం లేని జానర్ ని ముట్టుకోవడం ఎందుకు అని కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ‘అరవింద సమేత’ సినిమాని చూసే వరకు ఎవరికీ తెలియదు, త్రివిక్రమ్ లో ఈ రేంజ్ మాస్ యాంగిల్ కూడా ఉందా అని. అదే విధంగా రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కూడా కచ్చితంగా ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్క మహేష్ బాబు కి తప్ప అందరి హీరోలకు మంచి కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. మరి రామ్ చరణ్ కి కూడా ఆయన మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందిస్తాడో లేదో చూడాలి.