https://oktelugu.com/

RRR Movie: మీడియాపై పంచ్​లు పేల్చిన రాజమౌళి

RRR Movie: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో తారక్ కొమరం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 04:57 PM IST
    Follow us on

    RRR Movie: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

    RRR

    ఈ మూవీలో తారక్ కొమరం భీమ్​గా కనిపించనుండగా… చరణ్​ అల్లూరి సీతారామరాజు పాత్రలో దర్శనమివ్వనుననారు. కాగా నిన్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్​ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్​కు చేరుకుని… ప్రభంజనం సృష్టించింది.

    Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటి ఇచ్చిన మూవీ యూనిట్…

    అయితే, తాజాగా దర్శకుడు రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. ఇందులో ఈ సినమా హీరోలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే మీడియాపై జక్కన్న తనదైన శైలిలో పంచులు విసిరారు. ఈ సినిమా తర్వాత ఏ హీరోతో చేయబోతున్నారని అడగ్గా.. సదరు స్టార్​ హీరోతో సినిమా చేయబోతున్నాడని హెడ్​లైన్ పెడతారు.. అప్పుడు ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్ కిందకు పోతుంది. కాబట్టి ఆ సంగతి నాకు బాగా తెలుసు కనుక.. దానికి తగ్గ ప్రశ్నలే అడగండి.. ఇప్పుడు ఆర్​ఆర్​ఆర్ ప్రమోషన్స్​కు మాత్రమే వచ్చాం. అని కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ అంతగా మీకు ఆ విషయంపై సమాధానం కావాలంటే.. త్వరలోనే చిన్న చిట్​చాట్​ సెషన్​ పెట్టుకుందామని అన్నారు. ఈ సమాధానంతో సమావేశం మొత్తం నవ్వులు విరిసాయి.

    Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ పై స్పందించిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు…