https://oktelugu.com/

సెంటిమెంట్: ఫస్ట్ మ్యాచ్ లో ఓడిన ముంబై.. కప్ దానిదేనా?

ప్రతిసారి మొదటి మ్యాచ్ తోపాటు సీజన్ మొదట్లో రెండు మూడు మ్యాచ్ లు వరుసగా ఓడిపోతుంటుంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ లో ఎదురులేని ఐదు సార్లు చాంపియన్ జట్టు ఫస్ట్ మ్యాచ్ గెలుపును మాత్రం రుచిచూడడం లేదు. అయితే అలా ఓడిన ప్రతిసారి ఐపీఎల్ కప్ గెలిచింది. ముంబై ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ ఓడితే కప్ వారిదేనన్న సెంటిమెంట్ బలపడింది. ఐపీఎల్ లోనే తిరుగులేని జట్టుగా ముంబై ఇండియన్స్ ఉంది. దుబాయిలో జరిగిన గత ఐపీఎల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 10, 2021 / 01:26 PM IST
    Follow us on

    ప్రతిసారి మొదటి మ్యాచ్ తోపాటు సీజన్ మొదట్లో రెండు మూడు మ్యాచ్ లు వరుసగా ఓడిపోతుంటుంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ లో ఎదురులేని ఐదు సార్లు చాంపియన్ జట్టు ఫస్ట్ మ్యాచ్ గెలుపును మాత్రం రుచిచూడడం లేదు. అయితే అలా ఓడిన ప్రతిసారి ఐపీఎల్ కప్ గెలిచింది. ముంబై ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ ఓడితే కప్ వారిదేనన్న సెంటిమెంట్ బలపడింది.

    ఐపీఎల్ లోనే తిరుగులేని జట్టుగా ముంబై ఇండియన్స్ ఉంది. దుబాయిలో జరిగిన గత ఐపీఎల్ ట్రోఫిని గెలుచుకుంది. డిఫెండింగ్ చాంపియన్ అయిన ఈ జట్టు మొదటి మ్యాచ్ ఓడిపోవడం అనే బలహీనతను మాత్రం అధిగమించలేకపోతోంది.

    లీగ్ లో మొదటి మ్యాచ్ గెలవాలని ఏ జట్టు అయినా కోరుకుంటుంది. కానీ ముంబై మాత్రం ఓటమితో మొదలు పెట్టి ట్రోఫీని ఎగరేసుకుపోవడం వంతుగా పెట్టుకుంది.

    ఐపీఎల్ సీజన్లలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 9 సార్లు వరుసగా ఫస్ట్ మ్యాచ్ లో ముంబై ఓడిపోయింది. నిన్న కూడా బెంగళూరు చేతిలో ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోవడం విశేషం. ఎనిమిది సార్లు తొలి మ్యాచులో ఓటమి పాలైన ముంబై ఏకంగా ఐదు సార్లు విజేతగా అవతరించింది. 2013 నుంచి తొలి పోరులో ఆ జట్టు గెలిచిందే లేదు. సెంటిమెంట్ ను కొనసాగించిన ముంబై ఈసారి కూడా ట్రోఫి గెలవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.