
ఐపీఎల్ సీజన్ 14 నిన్న ప్రారంభమైంది. నిన్న ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన సత్తా చాటింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీజట్టు జయకేతనం ఎగరేసింది. నేటి సాయంత్రం మరో కీలక మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. శనివారమే అయినప్పటికీ ఈ సారి ఒక మ్యాచ్‌తోనే సరిపెట్టారు నిర్వాహకులు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స మధ్య సాగిన తొలి మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ దిగిన జట్టు విజయం సాధించిన నేపథ్యంలో.. రెండో మ్యాచ్ ఎలాంటి ఫలితాలనిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రిషబ్ పంత్ నేతృత్వం వహిస్తున్న ఢిల్లీ కేపిటల్స్ నేడు తలపడబోతున్నాయి. ముంబై వాంఖెడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ కొనసాగనుంది. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్.. అత్యంత అవమానకరంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కనీసం ప్లే ఆఫ్‌కు కూడా చేరలేకపోయింది. వరుస ఓటములతో పరాజయం పాలైంది. ఈ సారి దానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే కసితో కనిపిస్తోంది ధోనీ సేన.
ఈ టోర్నీలో ప్రతి జట్టును మట్టి కరిపించాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం ధోనీ సేన ఇప్పటికే హార్డ్ వర్క్ చేసింది. నెట్స్‌లో కఠోరంగా శ్రమించింది. కాగా..-చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న ఢిల్లీ కేపిటల్స్ కథ వేరుగా ఉంది. కిందటి ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఫైనలిస్ట్. ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది ఆ జట్టు. ఫైనల్ మ్యాచ్ దాకా వెళ్లిన తీరును, దూకుడును ఈ సారి కూడా కొనసాగించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో కొత్త సారథిని ఎన్నుకుంది ఆ జట్టు ఫ్రాంఛైజీ. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్‌కు జట్టు పగ్గాలను అప్పగించింది. గతేడాది ఢిల్లీ కేపిటల్స్‌కు శ్రేయాస్ అయ్యర్ కేప్టెన్సీ వహించగా.. ఈ సారి అతనికి బదులుగా రిషబ్ పంత్ తెరమీదికొచ్చాడు.
కాగా..- చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న ఢిల్లీ కేపిటల్స్ కథ వేరుగా ఉంది. కిందటి ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఫైనలిస్ట్. ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిందా జట్టు. ఫైనల్ మ్యాచ్ దాకా వెళ్లిన తీరును, దూకుడును ఈ సారి కూడా కొనసాగించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో కొత్త సారథిని ఎన్నుకుందా జట్టు ఫ్రాంఛైజీ. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్‌కు జట్టు పగ్గాలను అప్పగించింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చోటును దక్కించుకున్న కడప జిల్లా రాయచోటి క్రికెటర్ ఎం.హరిశంకర్ రెడ్డి.. ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. మీడియం పేసర్‌గా అతన్ని చెన్నై ఫ్రాంఛైజీ జట్టులోకి తీసుకుంది. వైవిధ్యమైన బంతులను సంధించడంలో నిపుణుడు. ఆంధ్రా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న హరిశంకర్ రెడ్డి ఐపీఎల్‌లో ఆడటం ఇదే తొలిసారి. నెట్స్‌లో అతను కఠోరంగా శ్రమించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీని అవుట్ చేసిన తీరు కూడా క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఢిల్లీ కేపిటల్స్ జట్టు కూర్పు ఇలా ఉండొచ్చు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, టామ్ కుర్రమ్.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో: ఫాఫ్ డు ఫ్లెసిస్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, సామ్ కుర్రమ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, కృష్ణప్ప గౌతమ్, శార్దుల్ ఠాగూర్.