Sarfaraz Khan: జడేజాతో రనౌట్‌ వివాదం.. స్పందించిన సర్ఫరాజ్…

India Vs England 3nd Test మొదటి మ్యాచ్ లోనే 62 పరుగులు చేసిన సర్ఫా రాజ్ ఖాన్...జడేజాతో కలిసి చాలా మంచి నాక్ ఆడాడు. కానీ వీళ్లిద్దరి మధ్య మిస్ అండర్ స్టాండింగ్ జరిగడం తో సార్ఫా రాజ్ ఖాన్ 62 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు.

Written By: Gopi, Updated On : February 16, 2024 10:24 am
Follow us on

India Vs England 3nd Test: రాజ్ కోట్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడోవ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఇక అందులో భాగంగానే రోహిత్ శర్మ, రవీంద్ర జడజా ఇద్దరు సెంచరీలతో చెలరేగగా, ఈ టెస్టులో అరంగేట్రం చేసి తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న సర్ఫా రాజ్ ఖాన్ కూడా రాణించాడు.

మొదటి మ్యాచ్ లోనే 62 పరుగులు చేసిన సర్ఫా రాజ్ ఖాన్…జడేజాతో కలిసి చాలా మంచి నాక్ ఆడాడు. కానీ వీళ్లిద్దరి మధ్య మిస్ అండర్ స్టాండింగ్ జరిగడం తో సార్ఫా రాజ్ ఖాన్ 62 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు. ఇక దానికి అందరూ జడేజా ను దూషిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ ఖాన్ ఈ విషయం మీద స్పందిస్తూ ‘ఆటలో ఇవన్నీ సహజం, పరుగుల కోసం పరిగెత్తేటప్పుడు ఇలా రనౌట్ అవుతునే ఉంటాం ‘. ఇవన్నీ పర్సనల్ గా తీసుకోకూడదు అంటూనే నేను ఆఫ్ సెంచరీ చేయడంలో నాకు జడేజా మొదటి నుంచి చాలా వరకు హెల్ప్ చేస్తూ వచ్చాడు, అంటూ జడేజా గురించి చాలా గొప్పగా చెప్పాడు.

ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 131 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 110 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక సర్పరాజు ఖాన్ 62 పరుగులు చేశాడు. ఇక వీళ్ళ ముగ్గురిని మినహాయిస్తే మిగిలిన ప్లేయర్లు ఎవరు కూడా పెద్దగా రాణించలేదు.ఇక మొదటి రోజు ఆట మూగిసే సమయానికి ఇండియా 326 పరుగులు చేసి తన సత్తాను చాటుకుంది. జడేజా 110 పరుగులు చేయగా, కుల్దిప్ యాదవ్ ఒక పరుగు చేసి క్రీజ్ లో ఉన్నాడు. ఇక ఈరోజు ఇండియా 400 లకు పైన పరుగులు చేసి ఇంగ్లాండ్ కి బ్యాటింగ్ ని ఇస్తే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్లను తొందరగా కట్టడి చేసి ఔట్ చేస్తే మన టీమ్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ కూడా మన చేతుల్లోకి వస్తుంది…