https://oktelugu.com/

NTR-Chiranjeevi: ఎన్టీయార్ చెప్పిన ఆ ఒక్క మాట వల్లే చిరంజీవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా..?

రీసెంట్ గా లోక్ నాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎన్టీయార్, పుణ్య తిథి, నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ప్రోగ్రాం కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 16, 2024 / 10:26 AM IST
    Follow us on

    NTR-Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎదురులేని హీరోగా ఎదిగిన అలనాటి మేటి నటుడు శ్రీ నందమూరి తారక రామారావు. ఇండస్ట్రీలో ఏ పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో ఆయనను మించిన నటుడు ఇప్పటివరకు ఎవరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రాముడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా ఏ పాత్ర వేసిన అందులో ఒదిగిపోయి నటించడం ఆయన నైజం.

    అందుకే ఇప్పటికి కూడా ఆయన పేరు ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగిన మరొక హీరో చిరంజీవి. ఈయన మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను చాటుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా లోక్ నాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎన్టీయార్, పుణ్య తిథి, నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ప్రోగ్రాం కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దాంతో ఆయన ఎన్టీఆర్, నాగేశ్వరరావు లతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశాడు.

    ఇక అందులో భాగంగానే ఒకసారి చిరంజీవి ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ చాలా ఆప్యాయంగా రండి బ్రదర్ కూర్చోండి అని చిరంజీవిని లోపలికి ఆహ్వానించి, మీ సినిమాలు బాగుంటున్నాయి. ఇప్పుడిప్పుడే మీరు వృద్ధిలోకి వస్తున్నారు. కాబట్టి వచ్చిన డబ్బులను ఇనుప ముక్కల మీద పెట్టకుండా స్థలాలు, ఇల్లులను కొనడానికి కేటాయించండి అవే మిమ్మల్ని ఫ్యూచర్లో కాపాడుతాయని చెప్పాడంట. దాంతో అప్పటివరకు చిరంజీవికి కార్లు అంటే చాలా ఇష్టం ఉండేదట మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కొనేవాడట. కానీ ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత నుంచి ఆయన లాండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడట.

    అయితే ఇక ఇప్పుడు అదే విషయాన్ని చిరంజీవి ఈ ఈవెంట్ లో గుర్తు చేసుకుంటూ చెప్పిన ఆ మాట వల్లే ఇప్పుడు నా ఫ్యామిలీని నేను పోషించుకోగలుగుతున్నాను అంటూ చిరంజీవి చెప్పాడు… అలా ఎన్టీఆర్ అప్పట్లో చాలామంది యంగ్ హీరోలని సైతం ప్రోత్సహిస్తూ, సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలో చెబుతూనే, ఎలాంటి పాత్రలు చేస్తే ఫ్యూచర్ బాగుంటుందో కూడా చెప్పేవాడట…