https://oktelugu.com/

RR Vs LSG: సంజూ అద్భుతం.. ఐనా పంత్, కేఎల్ రాహుల్ వెంటేనా? బీసీసీఐని ఏకేస్తున్న నెటిజన్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్ అంటేనే సంజుకు ఎక్కడ రెండు ఉత్సాహం వస్తుంది కావచ్చు.. ప్రారంభ మ్యాచ్లలో అతని గణాంకాలే ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టే అనాల్సి వస్తోంది. 2020లో సంజు ఐపిఎల్ ఎంట్రీ ఇచ్చాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 24, 2024 / 06:29 PM IST

    RR Vs LSG

    Follow us on

    RR Vs LSG: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఆదివారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సాంసన్ 82 పరుగులు చేశాడు. 52 బంతుల్లో మూడు ఫోర్లు, 6 సిక్స్ లతో లక్నో బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. అతడు బ్యాటింగ్ దాటికి ఏకంగా రాజస్థాన్ జట్టు 193 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ వన్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చిన సంజు ఓవర్లు ముగిసేంతవరకు దృఢంగా నిలబడ్డాడు. రాజస్థాన్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. బట్లర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగినా, భారీ స్కోరు సాధించే క్రమంలో యశస్విజస్వాల్ అవుట్ అయినా.. రియాన్ పరాగ్ తో కలిసి అతడు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అతనితో కలిసి మూడో వికెట్ కు ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యాన్ని సంజు నెలకొల్పాడు. ఫోర్లు, సిక్స్ లు మాత్రమే కాకుండా అవసరమైతే సింగిల్స్, టుడీ తీయడానికి కూడా వెనుకాడ లేదు. సంజు ఆ స్థాయిలో ఆడాడు కాబట్టే రాజస్థాన్ 193 పరుగులు చేయగలిగింది.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్ అంటేనే సంజుకు ఎక్కడ రెండు ఉత్సాహం వస్తుంది కావచ్చు.. ప్రారంభ మ్యాచ్లలో అతని గణాంకాలే ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టే అనాల్సి వస్తోంది. 2020లో సంజు ఐపిఎల్ ఎంట్రీ ఇచ్చాడు.. తొలి మ్యాచ్లో 74 పరుగులు చేశాడు. కేవలం 32 బంతుల్లోనే అతడు ఈ ఘనత సాధించాడు. 2021 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో అయితే ఏకంగా సెంచరీ సాధించాడు. కేవలం 63 బంతుల్లో 119 రన్స్ కొట్టి తన బ్యాటింగ్ స్టామినా వేరని నిరూపించాడు. ఇక 2022 సీజన్ ప్రారంభ మ్యాచ్లో 27 బంతుల్లో 55 పరుగులు దండుకున్నాడు. ఇక గత సీజన్ మొదటి మ్యాచ్లో 32 బంతుల్లోనే 55 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఇక ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లో లక్నో జట్టుపై 52 బంతుల్లో 82 పరుగులు సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.

    వాస్తవానికి సంజు అద్భుతమైన బ్యాటర్. ఖచ్చితమైన ఫుట్ వర్క్, షాట్ల ఎంపికలో అతడికి తిరుగులేదు. కానీ దురదృష్టవశాత్తు అతడు ఎక్కువ కాలం జట్టులో కొనసాగ లేకపోయాడు. ఇక ఐపీఎల్ లో లక్నో జట్టుపై సాధించిన 82 పరుగులతో సంజు పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దీంతో నెటిజెన్లు స్పందిస్తున్నారు.”బీసీసీఐకి నాణ్యమైన క్రికెటర్లను ఎంపిక చేయడం చేతకాదు. సింపతిని నమ్ముకున్న రిషబ్ పంత్ ను ఎంపిక చేస్తుంది. గాయాల బారిన పడే కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకుంటుంది. కానీ వారేమైనా దేశానికి వరల్డ్ కప్ లు తీసుకొచ్చారా? లేదు కదా? మమ్మల్ని క్షమించు సంజు.. నీ ప్రతిభను, నీ నైపుణ్యాన్ని భారత క్రికెట్ జట్టు వాడుకోలేకపోయింది. భారత సెలక్టర్లు ఉపయోగించుకోలేకపోయారంటూ” నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    సంజు 82 పరుగులు చేయడం ద్వారా అతడు సాధించిన రికార్డులను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అతడిని బీసీసీఐ సరిగ్గా వాడుకోలేకపోతోందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా అతని ఆట తీరును గుర్తించి… జట్టులో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అతడికి అవకాశం ఇస్తే జట్టుకు ఉపయోగపడతాడని.. బలమైన ఇన్నింగ్స్ ఆడతాడని బీసీసీఐ సెలెక్టర్లకు నెటిజన్లు సూచిస్తున్నారు.