IPL 2024 RR Vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు సాంసన్(82; 52 బంతుల్లో మూడు ఫోర్లు, 6 సిక్స్ లు) వీరోచిత బ్యాటింగ్ చేశాడు. అతడికి రియాన్ పరాగ్ (43; 29 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లు) తోడు కావడంతో రాజస్థాన్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లక్నో జట్టు ఎదుట 194 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ బట్లర్ (11) నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు అవుటైన వెంటనే వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన సంజు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్ కు 36 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు జైస్వాల్(24) 4.6 ఓవర్ వద్ద మోహసిన్ ఖాన్ బౌలింగ్లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ క్రీజ్ లోకి వచ్చాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరును 142 పరుగుల వరకు తీసుకెళ్లారు. 14.5 ఓవర్లో రియాన్ పరాగ్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సిమ్రోన్ హిట్ మేయర్(5) ఆకట్టుకోలేదు. ధృవ్ జురెల్(20; 12 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్) మెరుపులు మెరిపించాడు. సంజు సాంసన్, జురెల్ 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అప్పటికి ఓవర్లు మొత్తం పూర్తి కావడంతో రాజస్థాన్ 193 పరుగులు చేసింది. లక్నో ఎదుట 114 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్ లో చేసిన 82 పరుగుల ద్వారా సంజు సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అతడు 2020లో ఐపీఎల్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్లో 32 బంతుల్లో 74 పరుగులు చేశాడు. 2021 సీజన్ ప్రారంభ మ్యాచ్లో 63 బంతుల్లో 119 పరుగులు చేశాడు. 2022 సీజన్ ప్రారంభ మ్యాచ్లో 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. గత సీజన్ ప్రారంభ మ్యాచ్లో 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇక 2024 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్లో లక్నో జట్టుపై 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇలా ప్రారంభ మ్యాచ్లో వరసగా నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి అరుదైన ఘనతను తన పేరుమీద సంజు లిఖించుకున్నాడు.
ఆదివారం నాటి మ్యాచ్ లోనూ లక్నో బౌలర్లను సంజు ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా యాష్ ఠాకూర్ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓవర్లన్నీ ముగిసాయి కాబట్టి సంజు 82 పరుగుల వద్ద ఆగాడు. లేకుంటే సెంచరీ బాదేవాడేమో. పరాగ్ అవుట్ అయిన తర్వాత.. సంజు కు సరైన జోడి దొరకలేదు. హిట్మేయర్ కంటే ముందు జురెల్ వచ్చి ఉంటే రాజస్థాన్ స్కోర్ మరో విధంగా ఉండేది. ఇక రాజస్థాన్ బౌలర్లలో నవీన్ 2, మోహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లు ఎక్స్ ట్రా ల రూపంలో 8 పరుగులు ఇవ్వడం విశేషం.
No Sanju Samson fan will pass without reacting love on this tweet ❤️
#RRvLSG | #SanjuSamson | pic.twitter.com/tSjoSNOWZ5
— Rajasthan Royals Fans Army™ – RR Fan Club (@RoyalsFansArmy) March 24, 2024