Sanath Jayasuriya : మెరుగైన దౌత్య విధానాన్ని కొనసాగించడం వల్లే ప్రపంచ దేశాల వద్ద భారత్ పరపతి గతంలో కంటే మరింత మెరుగైంది. మెరుగైన ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో భారత్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే భారత్ ప్రపంచం మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు. ఇతర దేశాలతోనే కాదు.. ఆసియాలో ఉన్న దేశాలతోనూ మెరుగైన దౌత్య విధానాన్ని కొనసాగించడానికి నరేంద్ర మోడీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో బాగానే ఆసియా ఖండంలో ఉన్న దేశాలలో ఇటీవల పర్యటించారు. అందులో శ్రీలంక కూడా ఒకటి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న తర్వాత.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నరేంద్ర మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వం చైనాతో అంట కాగిన నేపథ్యంలో.. చైనాతో ఎప్పటికైనా ముప్పే అని భావించి.. నరేంద్ర మోడీ శ్రీలంకలో పర్యటించారు. అక్కడ ప్రభుత్వ పెద్దలతో పాటు.. క్రికెటర్లను కూడా కలిశారు.
Also Read : ముంబై పై గెలిచిన తర్వాత.. విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే.. నవ్వు ఆపుకోలేరు..
జయసూర్య అడిగారు.. మోడీ కాదనలేకపోయారు
శ్రీలంకకు వరల్డ్ కప్ అందించిన జట్టులో జయ సూర్య(Sanath jayasurya) కీలక సభ్యుడు. నాడు అర్జున రణతుంగ(Arjuna ranatunga) ఆధ్వర్యంలో శ్రీలంక జట్టు వరల్డ్ కప్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో నాటి వరల్డ్ కప్ దక్కించుకున్న క్రికెట్ బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసింది. ఈ సందర్భంగా వారి మధ్య అనేక చర్చలు జరిగాయి. ప్రముఖంగా జయసూర్య ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు. కాకపోతే ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. “శ్రీలంకలో కొలంబో తర్వాత అంత పెద్ద నగరంగా జాఫ్నా కు పేరుంది. ఇక్కడ అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. వారిలో అనితర సాధ్యమైన ప్రతిభ ఉంది. అవకాశం ఉంటే ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ అకాడమీ ని మీరు నెలకొల్పండి. ఇక్కడ ప్రపంచ స్థాయిలో సదుపాయాలు కల్పిస్తే.. ఇందులో శిక్షణ పొందే క్రికెటర్లు గొప్పగా రాణిస్తారు. వారు విశ్వ వేదికపై ఆకట్టుకుంటారు. మీరు ఈ దిశగా ఆలోచించండి” అంటూ నరేంద్ర మోడీని జయసూర్య కోరగా.. దానికి నరేంద్ర మోడీ సమ్మతం తెలిపారు. ఈ విషయాన్ని ఇండియాకు వెళ్లిన తర్వాత.. బీసీసీఐ పెద్దలతో చర్చించి చెబుతానని హామీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే శ్రీలంకతో ఇప్పుడు భారత్ కు దౌత్య సంబంధాలు అత్యంత ముఖ్యం. పైగా చైనాతో గత ప్రభుత్వం అంట కాగిన నేపథ్యంలో.. శ్రీలంక పక్కలో బల్లెం కావొద్దు అనేది నరేంద్ర మోడీ అభిమతం. అందువల్లే జయసూర్య చేసిన విజ్ఞప్తి కాదనలేకపోయారు. బహుశా మరికొద్ది రోజుల్లో జాఫ్నా లో భారత ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీ నెలకొల్పే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్ – శ్రీలంకల మధ్య దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
Also Read : తన వికెట్ తీసిన యష్ దయాళ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోహిత్..
A REQUEST FROM JAYASURIYA TO PM NARENDRA MODI
Sanath Jayasuriya said “There are many talented cricketers in Jaffna so I requested the honourable Prime minister if he could help us build this facility (International cricket stadium) in Jaffna, he said he would discuss with… pic.twitter.com/9sSnJo1d4h
— Johns. (@CricCrazyJohns) April 8, 2025