Saina Nehwal Divorce: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన విడాకులను ప్రకటించిన విషయం తెలిసిందే. తన భర్త పారుపల్లి కశ్యప్ తో విడిపోతున్నట్టు ఆమె ప్రకటించింది. కశ్యప్ ను సైనా సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. వివాహానికంటే ముందు వీరిద్దరూ చాలా సంవత్సరాలు పాటు స్నేహంగా ఉన్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. కొద్దిరోజులు ప్రేమికులుగా ఉన్న వారిద్దరూ.. అనంతరం తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఈ కుటుంబ సభ్యుల అనుమతితో ఘనంగా వివాహం చేసుకున్నారు..
Also Read: కూలీ ట్రైలర్ రివ్యూ: కాస్టింగ్, యాక్షన్ ఎక్కువ.. మ్యాటర్ తక్కువైందే!
వివాహం జరిగిన నాటి నుంచి సైనా కశ్యప్ దంపతులు కలివిడిగానే ఉన్నారు.. వీరిద్దరూ కలిసి టోర్నీలు కూడా ఆడారు. అయితే సైనా ఒకపట్లగా విజయాలు సాధించలేకపోయింది. దీంతో ఆమె కెరియర్ చరమాంకంలోకి చేరుకుంది.. కశ్యప్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.. వీరిద్దరూ ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడలోనే ఉన్నప్పటికీ.. ప్లేయర్లుగా కాకుండా.. శిక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సైన తన విడాకుల గురించి ప్రకటన చేయడం సంచలనం కలిగించింది. సైనా ఆ స్థాయిలో ప్రకటిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఆ ప్రకటన చేసిన కొద్ది రోజుల తర్వాత సైనా సోషల్ మీడియాలో మరో కీలక విషయాన్ని వెల్లడించింది.
విడాకుల విషయం ప్రకటించగానే సైనా – కశ్యప్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. వారిద్దరికీ ఏమైంది? ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై ఆరాలు మొదలయ్యాయి. సైనా, కశ్యప్ కు సన్నిహితులైన వారు ఇద్దరికీ సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే అవి సఫలీకృతం కావడంతో సైనా, కశ్యప్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.. ఇదే విషయాన్ని సైనా తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించింది.. కశ్యప్ తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..” కొన్నిసార్లు దూరం సన్నిహితుల విలువను తెలియజేస్తుందనే” అర్థం వచ్చే విధంగా ఆమె రాసుకొచ్చింది. దీంతో వారిద్దరు కలిసి పోతున్నారని.. విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.