Homeక్రీడలుSaiteja Mukkamalla: అమెరికా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు తేజం సాయి తేజ..!

Saiteja Mukkamalla: అమెరికా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు తేజం సాయి తేజ..!

Saiteja Mukkamalla: అంతర్జాతీయ క్రికెట్లో వివిధ దేశాలకు ఆడుతున్న భారత సంతతికి చెందిన క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. మొన్నటికి మొన్న వెస్టిండీస్ తో జరిగిన నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఒక ఆటగాడు సెంచరీ తో కదం తొక్కాడు. వెస్టిండీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కూడా నెదర్లాండ్స్ జట్టు అలవోకగా చేదించింది. దీని వెనుక భారత సంతతికి చెందిన తేజ నిడమానూరు ఆడిన అద్భుత ఇన్నింగ్సే కారణం. ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడిపోయిన తర్వాత వరల్డ్ కప్ ఆడే జట్లలో చోటు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తేజ నిడమానూరు విజయవాడకు చెందిన కుర్రాడు కాగా.. తాజాగా మరో తెలుగు కుర్రాడు సాయి తేజ ముక్కమల్ల అమెరికా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.

అమెరికా క్రికెట్ జట్టులో ఆల్రౌండర్ గా సాయి తేజ చోటు దక్కించుకున్నాడు. 19 ఏళ్ల వయసున్న ఈ యంగ్ క్రికెటర్ ఇప్పటి వరకు అమెరికాలోని డ్రీమ్ క్రికెట్ విల్లో జట్టు తరఫున 49 మ్యాచులు ఆడాడు. 49 మ్యాచుల్లో 2006 పరుగులు చేయగా, బౌలింగ్ విభాగంలోను ప్రతిభ చాటి 15 వికెట్లు పడగొట్టాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కాగా, రైట్ ఆర్మ్ మీడియం ఫేస్ బౌలింగ్ తో బౌలింగ్ చేయగలడు. 2004లో న్యూ జెర్సీలో జన్మించాడు. ఆన్సర్ జాతీయ మ్యాచులు విషయానికి వస్తే 16 వన్డే మ్యాచ్లు ఆడిన సాయి తేజ 360 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 120 కాగా, చివరిసారిగా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో వారం రోజుల కిందట మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో 46 బంతుల్లో 55 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే అమెరికా జట్టు తరఫున దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ ఏడాది ప్రారంభమైన అమెరికా లీగ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు.

RELATED ARTICLES

Most Popular