Sai Sudharsan: ప్రస్తుత ఐపీఎల్ లో అపరిమితమైన ప్రతిభ ఉండి.. అనితర సాధ్యమైన ఆడతీరుగున్న ఆటగాళ్ల జాబితాలో సాయి సుదర్శన్ (Sai Sudarshan) ఒకడు. వేగంగా పరుగులు చేయడంలో.. దూకుడుగా ఆడటంలో.. ప్రత్యర్థులపై ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడటంలో సాయి సుదర్శన్ దిట్ట. గొప్పగా ఆడతాడు.. స్థిరంగా ఆడతాడు. బలంగా ఆడుతాడు. వేగవంతంగా పరుగులు తీస్తూ ఆకట్టుకుంటాడు. అందువల్లే అతడు ప్రస్తుతం గుజరాత్ జట్టు లో కీలక ఆటగాడిగా మారిపోయాడు. బుధవారం రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భీకరమైన ఫామ్ లో ఉన్న గిల్(2) త్వరగానే అవుట్ అయినా సాయి సుదర్శన్ (82) ఏమాత్రం అధైర్య పడలేదు. షారుక్ ఖాన్ (36), బట్లర్ (36) తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నిర్మించాడు. అందువల్లే గుజరాత్ జట్టు 218 పరుగుల టార్గెట్ ను రాజస్థాన్ జట్టు ముందు ఉంచింది.. ఈ టార్గెట్ ను చేజ్ చేసే క్రమంలో రాజస్థాన్ జట్టు తడబడుతోంది.
Also Read: మెరుపు స్టంప్ ఔట్ .. ధోనిని గుర్తుచేసిన సంజు శాంసన్..
అదరగొట్టిన సాయి సుదర్శన్
ఈ మ్యాచ్లో 82 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. మరోసారి గుజరాత్ జట్టు తరఫున ఆపద్బాంధవుడు అయ్యాడు. అయితే గడిచిన తొమ్మిది ఇన్నింగ్స్లలో సాయి సుదర్శన్ రెండుసార్లు మాత్రమే సింగల్ డిజిట్ స్కోర్ చేశాడు. మిగతా అన్ని సందర్భాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. గడిచిన తొమ్మిది ఇన్నింగ్స్లలో 65 పరుగులు (39 బంతుల్లో), 84* పరుగులు(49 బంతుల్లో), ఆరు పరుగులు (14 బంతుల్లో), 103 పరుగులు (51 బంతుల్లో), 74 పరుగులు (41 బంతుల్లో), 63 పరుగులు(41 బంతుల్లో), 49 పరుగులు (36 బంతుల్లో), ఐదు పరుగులు (9 బంతుల్లో), 82 పరుగులు (53 బంతుల్లో) చేశాడు సాయి సుదర్శన్. అందువల్లే అతడిని గుజరాత్ అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో అతని పేరును తెగ ట్రెండ్ చేస్తున్నారు. “సాయి సుదర్శన్ జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. తన స్థిర చిత్తాన్ని కోల్పోవడం లేదు. ప్రత్యర్థి బౌలర్లకు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు. అందువల్లే అతడు గుజరాత్ జట్టులో భిన్నమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.. అతడు ఇదే ప్రతిభ గనుక చూపిస్తే టీమ్ ఇండియాలో కచ్చితంగా సుదర్శన చక్రం తిప్పుతాడని” గుజరాత్ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో సాయి సుదర్శన్ న్ గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. టీమిండియాలో చోటు తగ్గలేదు. వాస్తవానికి అతడికి జట్టులో చోటు లభిస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి. కాని చివరికి ఏం జరిగిందో తెలియదు.. కానీ ఈసారి మాత్రం అతడు జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటాడని.. టీమిండియా సాధించే విజయాలలో కీలకపాత్ర పోషిస్తాడని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: కమ్మేసుకున్న గర్ల్ ఫ్రెండ్ మాయ.. యశస్వి జైస్వాల్ ఎలా అయిపోయాడు?