Yashasvi Jaiswal: టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా మారడానికి యశస్వి జైస్వాల్ తీవ్రంగా కష్టపడ్డాడు. పానీపూరీ బండి వద్ద పనిచేశాడు. డబ్బుల కోసం పాల ప్యాకెట్లు వేశాడు. చివరికి ఉండడానికి చోటు లేకపోతే టెంట్ షామియానా కింద సేద తీరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యశస్వి జైస్వాల్ కష్టాలు సినిమాటిక్ లాగానే కనిపిస్తాయి. కానీ అన్ని కష్టాలను దాటుకుని యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియాలో అద్భుతమైన ఆటగాడిగా పేరుపొందాడు. ఎడమ చేతివాటం బ్యాటింగ్ తో ఒకప్పటి యువరాజ్ సింగ్ ను గుర్తుకు తెచ్చేవాడు. అటువంటి ఆటగాడు కాబట్టే యశస్వి జైస్వాల్ కు విపరితమైన అవకాశాలు వచ్చాయి. కానీ అటువంటి ఆటగాడు కొంతకాలం నుంచి ఫామ్ కోల్పోయాడు. అందువల్లే అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం లభించలేదు. అంతకంటే ముందు జరిగిన టి20 వరల్డ్ కప్ లోనూ చోటు లభించలేదు . ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్క సెంచరీ మినహా.. మిగతా అన్నిట్లోనూ జైస్వాల్ విఫలమయ్యాడు.
Also Read: యశస్వి జైస్వాల్ జాంటీ రోడ్స్ అయ్యాడు.. రషీద్ ఖాన్ బిత్తర పోయాడు..
ఐపీఎల్ లో కూడా…
గత ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు తరఫున పరుగుల వరద పారించాడు ఎస్ఎస్వి జైస్వాల్. దుమ్ములేపే ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే అటువంటి ఆటగాడు ఈ సీజన్లో విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జట్టు విజయాలలో పాలుపంచుకోలేదు. అన్నిటికీ మించి తన స్థాయి తగ్గట్టుగా ఆటను ప్రదర్శించడం లేదు. ఇక తాజాగా బుధవారం గుజరాత్ జట్టులో జరిగిన మ్యాచ్లో.. ఆరు పరుగులు మాత్రమే చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే ఇటీవల జైస్వాల్ ఆటను పక్కనపెట్టి తన గర్ల్ ఫ్రెండ్ హామిల్టన్ తో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. దానికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అందువల్లే అతడు తన ఆటపై అంత సీరియస్ గా దృష్టి సారించడం లేదని.. అందువల్లే ఇలా అవుట్ అవుతున్నాడని రాజస్థాన్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల హామీల్టన్, అతడి సోదరుడితో కలిసి ఒక గది లో యశస్వి జైస్వాల్ ఉన్నాడు. ఆ ముగ్గురు కలిసి ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫోటోను రాజస్థాన్ అభిమానులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ మాయ మొత్తం కమ్ముకున్న తర్వాత జైస్వాల్ ఇంకేం ఆట ఆడతాడని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: మెరుపు స్టంప్ ఔట్ .. ధోనిని గుర్తుచేసిన సంజు శాంసన్..