Sai Sudharsan: గత ఐపిఎల్ గుజరాత్ జట్టు గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లిపోయింది. 2022లో విజేతగా నిలిచిన గుజరాత్.. 2023లో రన్నరప్ గా నిలిచింది. 2024 లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. వరుస వైఫల్యాలతో దారుణమైన ఆటతీరు ప్రదర్శించింది. ఫలితంగా గ్రూప్ దశనుంచే ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఈ సీజన్లో మాత్రం అంతకుమించి అనే రేంజ్ లో గుజరాత్ ఆడుతోంది. బలమైన జట్లపై ఏకపక్షమైన విజయాలు సాధిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముంబై నుంచి మొదలు పెడితే బెంగళూరు వరకు ఏ జట్టును కూడా వదలకుండా గుజరాత్ విజయాలు సాధిస్తున్నది.. బౌలింగ్లో సత్తా చూపిస్తోంది. బ్యాటింగ్లో దుమ్ము రేపుతోంది. ఫలితంగా గుజరాత్ ఏకపక్ష విజయాలతో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గొప్ప గొప్ప ప్లేయర్లు కాకపోయినప్పటికీ.. ఉన్నవారితోనే మెరుగైన ప్రదర్శన చేయిస్తూ గుజరాత్ ఏకంగా పాయింట్లు పట్టికలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది.
Also Read: ఉగ్రదాడికి ముందు.. జ్యోతి మల్హోత్రా పహల్గాం పర్యటన.. వెలుగులోకి సంచలన నిజం!
12 మ్యాచ్లు.. 617 పరుగులు
ఐపీఎల్ రీస్టార్ట్ అయిన తర్వాత.. ఆడియన్స్ కు అసలైన క్రికెట్ ఆనందాన్ని గుజరాత్ జట్టు అదివారం అందించింది. మామూలుగా అయితే రీస్టార్ట్ తర్వాత ఆటగాళ్లు అంతగా ఆడతారా.. ప్రేక్షకులకు క్రికెట్ వినోదాన్ని అందిస్తారా అనే అనుమానం ఉండేది. ఆ అనుమానాన్ని గుజరాత్ జట్టు పటాపంచలు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టును మట్టి కరిపించింది గుజరాత్. దీని అంతటి కారణం గుజరాత్ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్. ఢిల్లీ జట్టు 200 టార్గెట్ విధిస్తే.. దానిని సాయి సుదర్శన్ వల్ల గుజరాత్ 19 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. ఈ సీజన్లో సాయి సుదర్శన్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. 12 మ్యాచ్లు ఇప్పటివరకు ఆడిన అతడు 617 పరుగులు చేశాడు. ఇక ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో 61 బాల్స్ లో తిరుగులేని సూపర్ సెంచరీ చేశాడు. 108 రన్స్ చేసి చివరి వరకు అజేయుడిగా నిలబడ్డాడు. 61 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. డజన్ ఫోర్లు కొట్టి.. వీర విహారం చేశాడు. 12 మ్యాచ్లలో 617 పరుగులు చేసిన సాయి సుదర్శన్ ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ ప్రస్తుతం 157 ఉంది. యావరేజ్ 56.09 గా ఉంది.
ఈ సీజన్లో గిల్ తో కలిసి సాయి సుదర్శన్ సూపర్ ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. ఒకటి రెండు మ్యాచ్ లు మినహా.. మిగతా అన్నింటిలోనూ సాయి సుదర్శన్ సూపర్ ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. అందువల్లే గుజరాత్ ఏకపక్ష విజయాలు సాధిస్తోంది. ప్రస్తుత ఐపిఎల్ లో గొప్ప గొప్ప జట్ల కూడా సాధ్యం కాని రికార్డులను సిద్ధం చేసుకుంటున్నది. ఒకవేళ గుజరాత్ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ ఇదే జోరు కొనసాగిస్తే.. కచ్చితంగా రెండవసారి ఛాంపియన్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.