BCCI: ఇటీవల ఛాంపియన్ ట్రోఫీని నిర్వహించినప్పుడు.. ఉగ్రవాద దేశం.. ఆ ట్రోఫీని తమ దేశంలో ప్రదర్శించింది. దానికంటే ముందు తను ఆక్రమించిన కాశ్మీర్ లోని పలు ప్రాంతాలలో ప్రదర్శించాలని అనుకుంది. దానికి భారత క్రికెట్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని ఐసిసి దృష్టికి తీసుకువెళ్లింది. ఈ విషయాన్ని ఐసిసి తీవ్రంగా పరిగణించడంతో ఉగ్రవాద దేశం వెనక్కి మరలాల్సి వచ్చింది. చివరికి భారత్ తీసుకొచ్చిన ఒత్తిడితో ఉగ్రవాద దేశం పప్పులు ఉడకలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే హక్కులు రావడంతో ఉగ్రవాద దేశ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో బయట అప్పుడు తీసుకువచ్చి స్టేడియాలను అభివృద్ధి చేసింది. భారత్ తమ దేశానికి వస్తుందనే ఆశతో భారీగా ఆదాయాన్ని సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఉగ్రవాద దేశం ఊహించినట్టుగా భారత్ అక్కడికి వెళ్లలేదు. దీంతో టెర్రరిస్ట్ కంట్రీ కి అప్పులు తప్పలేదు.
Also Read: 12 మ్యాచ్ లు.. 617 పరుగులు.. ఐపీఎల్ లో గుజరాత్ డైనమైట్ ఓపెనర్ ఇతడు..
ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఆడేది లేదని.. అసలు ఆ దేశంలోకి వెళ్ళేది లేదని భారత్ స్పష్టం చేసింది. దానికి తగ్గట్టుగానే ఉగ్రవాద దేశంలోకి అడుగు పెట్టకుండా.. దుబాయ్ వెళ్లిపోయింది. హైబ్రిడ్ మోడ్ లో మొత్తం మ్యాచ్ లు ఆడింది. చివరికి ఒక్క ఓటమి కూడా ఎదురు కాకుండా ఛాంపియన్ గా అవతరించింది. దీనిపై ఉగ్రవాద దేశం ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేసినప్పటికీ.. చివరికి జాతీయ జెండాలను పాకిస్తాన్లో ఎగరవేయకుండా చేసినప్పటికీ.. భారత్ సైలెంట్ గా చూస్తూ ఉండిపోయింది. చివరికి ఉగ్రవాద దేశానికి ఎలాంటి సమాధానం చెప్పాలో.. అలాంటి సమాధానం చెప్పింది. దీంతో సొంత దేశంలో ట్రోఫీ నిర్వహించినప్పటికీ.. ఉగ్రవాద దేశం గ్రూప్ దశ నుంచే ఇంటికి రావాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు ఉగ్రవాద దేశంతో ఉద్రిక్తత ఏర్పడిన నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు దూరంగా ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనబోమని స్పష్టం చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మోహ్సిన్ నఖ్వి కొనసాగుతున్నాడు. బీసీసీఐ తీసుకొని నిర్ణయితంగా ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్, సెప్టెంబర్లో మెన్స్ ఏషియా కప్ లో భారత జట్లు పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ” భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇప్పట్లో ఈ ఆగ్రహం చల్లారే అవకాశం కనిపించడం లేదు.. దీనికి తోడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈవెంట్లపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం భారత్ ఉగ్రవాద దేశానికి సంబంధించిన ఈ ఆనవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.