Sai Kishore : సాయి కిషోర్ కోసం గుజరాత్ జట్టు రెండు కోట్లు ఖర్చు చేస్తే చాలా మంది ఆశ్చర్యంగా చూశారు. కానీ అతడు ఎంత విలువైన బౌలరో విమర్శకులకు ఇప్పుడు అర్థమవుతున్నది. అద్భుతమైన బంతులు వేస్తూ.. నిర్జీవమైన పిచ్ పై మ్యాజిక్ చేస్తూ అదరగొడుతున్నాడు సాయి కిషోర్.. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో సిరాజ్ నాలుగు వికెట్లు సాధిస్తే.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ కలిసి ఆరు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోవడానికి.. మిడిల్ ఆర్డర్ విఫలమవ్వడానికి ఓ కారణం సాయి కిషోర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాయి కిషోర్ ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై (30/3) మూడు వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ జట్టులో జరిగిన మ్యాచ్లో (37/1) ఒక వికెట్ దక్కించుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో (22/2) రెండు వికెట్లు నేల కూల్చాడు. ఇక తాజాగా హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో (24/2) రెండు వికెట్లను తన ఖాతాలో వెసుకున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లలో అతడు 8 వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ బాల్ అందుకుంటే చాలు.. క్రికెట్ గ్యారెంటీ అనే ముద్ర వేసుకున్నాడు..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి (31), క్లాసెన్(27) ను అవుట్ చేసి.. హైదరాబాద్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. వీరిద్దరిని అవుట్ చేయడంతో హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ భారీ స్కోర్ చేసే దిశగా కనిపించలేదు.. మొత్తంగా హైదరాబాద్ ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది .
Also Read : సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిన హైదరాబాదీ!
ఇదీ సాయి కిషోర్ ప్రస్థానం
2018-19 కాలంలో తమిళనాడు జట్టు తరఫున సాయి కిషోర్ రంజి ట్రోఫీ ఆడాడు. అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్గా అతడు ఆవిర్భవించాడు. 2020 ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిని 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టు అతనిని మూడు కోట్లకు దక్కించుకుంది. ఇక 2025 సీజన్ కు సంబంధించి సాయి కిషోర్ ను గుజరాత్ టైటాన్స్ రెండు కోట్లకు నిలుపుకుంది. దీనికోసం రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకుంది. ఇక ప్రస్తుతం దేశీయ క్రికెట్లో తమిళనాడు జట్టు తరుపున సాయి కిషోర్ ఆడుతున్నాడు. 2023 లో జరిగిన ఆసియా క్రీడలలో భారత జట్టు తరుపున t20 లలో ఎంట్రీ ఇచ్చాడు.. వైవిధ్యంగా బంతులు వేయడం.. నిర్జీవమైన పిచ్ పై బంతులను మెలి తిప్పడం సాయి కిషోర్ కు బాల్ తో పెట్టిన విద్య. అందువల్లే అతడు ఐపిఎల్ లో అదరగొడుతున్నాడు. ఇక వచ్చే మ్యాచ్లో అతడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాల్సి ఉంది.
Also Read : ఓరయ్యా ఇవాళ ఆదివారం.. ఒక్క మ్యాచ్చేనా?