Arjun Tendulkar: మనదేశంలో సెలబ్రిటీల ప్రేమ కథల గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. వారి ప్రేమ కథలో ఉన్న నాటకీయత, ఇతర వ్యవహారాల గురించి సామాన్య జనంలో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా కాలం కాబట్టి.. ఇటువంటి నాటకీయత ఉన్న కథనాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చర్చ కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంటుంది. మన దేశ సెలబ్రిటీల ప్రేమ కథలు రకరకాల ప్రచారాలలో ఉన్నాయి. అందులో లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రేమ కథ కూడా ఉంది. అందువల్లే అతడు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాడు.
సచిన్ కుమారుడు క్రికెట్ వైపు ఆసక్తి చూపించినప్పటికీ.. తండ్రి స్థాయిలో మాత్రం సత్తా చూపించలేకపోయాడు. తండ్రి క్రికెట్ లెజెండ్ అయితే.. అతనిలో సగం వంతు కూడా పేరు సంపాదించుకోలేకపోయాడు. ఐపీఎల్ లో ముంబై జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. అతడు తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. అర్జున్ సానియా చందోక్ అనే యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సానియాతో అతడు చాలాకాలంగా డేటింగ్ లో ఉన్నాడని ప్రచారంలో ఉంది. ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఎంగేజ్మెంట్ జరిగిందని తెలుస్తోంది.
సానియా, అర్జున్ కుటుంబాలకు చాలా సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి. సచిన్ కుమార్తె సారా, సానియా స్నేహితులు. సారా సానియాతో ఉన్న ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. మొదట్లో అర్జున్, సానియా స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత క్రమేపి వారిద్దరి మధ్య బంధం పెరిగిపోయింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. తమ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఇద్దరు కూడా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 13న అర్జున్, సానియా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. కేవలం కొంతమంది సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగింది. అయితే వివాహం ఎప్పుడు జరుగుతుందని దాని గురించి ఇంతవరకు క్లారిటీ లేదు.
మరోవైపు సానియా వ్యాపారంలో ఉంది. ఆమె మిస్టర్ పావ్స్ పెట్ స్పా స్టోర్ ను నిర్వహిస్తున్నారు. సానియత్ తాత రవి ఘాయ్ ముంబైలో హోటల్ వ్యాపారంలో ఉన్నారు. ఇంటర్ కాంటినెంటల్ పేరుతో హోటల్స్ నిర్వహిస్తున్నారు. కాగా, సచిన్ టెండూల్కర్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. తనకంటే వయసులో పెద్దదైన అంజలిని ప్రేమించి.. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ పెళ్లి చేసుకోబోతున్నప్పటికీ.. ఇంతవరకు సారా తన ప్రేమ గురించి కానీ, వైవాహిక జీవితం గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పట్లో గిల్ తో సారా డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లు అని తేలిపోయాయి.