Homeక్రీడలుSachin Tendulkar: సచిన్ రీ ఎంట్రీ.. సౌరవ్ గంగూలీ తన బ్యాచ్ నంతా బీసీసీఐలోకి ఎందుకు...

Sachin Tendulkar: సచిన్ రీ ఎంట్రీ.. సౌరవ్ గంగూలీ తన బ్యాచ్ నంతా బీసీసీఐలోకి ఎందుకు దింపుతున్నాడు?

Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ త్వరలో కీలక పదవని ఇవ్వబోతుందని తెలుస్తోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తన టీమ్ మెట్స్ అందరినీ ఒక్కొక్కరిగా క్రికెట్ లోకి తీసుకుంటున్నారని గత కొద్ది కాలం నుంచి వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించాడు. ఇక ఇప్పుడు సచిన్ టెండూల్కర్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డాడు దాదా.

Sachin Tendulkar
Sachin Tendulkar

తాను సచిన్ ను తీసుకొచ్చేందుకుగాను ప్రయత్నిస్తున్నానని, ఆ దిశగా కార్యచరణ స్టార్ట్ చేశానని ఇప్పటికే దాదా తెలిపారు. సచిన్ ను తీసుకొచ్చే బాధ్యత బీసీసీఐ సెక్రెటరీ జైషాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అలా భారత క్రికెట్‌ బోర్డులో కీలక పదవిని సచిన్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సమీప భవిష్యతుల్లోనే సచిన్ సేవలను వాడుకోవాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ విషయమై సచిన్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.

Also Read: టార్గెట్ బీజేపీ.. సీఎం కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ కీలక భేటీ.. జాతీయ రాజకీయాలపై ఫోకస్

పదహారేళ్ల ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి తనదైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తనపైన ఎన్ని విమర్శలు వచ్చినా వాటన్నిటికీ తన బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. అత్య‌ధిక మ్యాచ్‌లు, ప‌రుగులు, సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీలు, బౌండ‌రీలు.. ఇలా ఎన్నో మైలురాళ్లను సచిన్ తన కెరీర్‌లో అందుకున్నాడు. అటువంటి సచిన్ సేవలను వాడుకోవాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నది.

రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ కలిగిన సచిన్ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 3,400 రన్స్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ తరహాలోనే సచిన్ టెండూల్కర్ ను కూడా డీల్ చేయబోతున్నారని తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే కొందరు బీసీసీఐ సెక్రెటరీ సచిన్ ను కలిసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. సచిన్ ఏ విధంగా స్పందిస్తారో.. 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్..మళ్లీ క్రికెట్ రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వస్తుండగా క్రికెట్ అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  పవన్ కళ్యాణ్ తో చేయ‌డం అదృష్టంగా భావిస్తోందట !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular