Homeఆంధ్రప్రదేశ్‌Jana Sena: జనసేనాని దారెటు: కలిస్తే గెలుస్తారు.. కలవకపోతే అధికారం కల్లేనా?

Jana Sena: జనసేనాని దారెటు: కలిస్తే గెలుస్తారు.. కలవకపోతే అధికారం కల్లేనా?

Jana Sena: ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్నప్పటికీ ఏపీ రాజకీయం అప్పుడే హీటెక్కింది. రాజకీయ పార్టీల పొత్తుల విషయమై అప్పుడే చర్చలు జరుగుతున్నాయి. వన్ సైడ్ లవ్..అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేనకు ఇన్ డైరెక్ట్ ఆహ్వానం పంపారు. అయితే, ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఈ విషయమై సైలెంట్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓ సారి కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి ఘోర పరాభవం మూట కట్టుకున్న పవన్.. ఈ సారి అయినా విజయం సాధించాలనుకుంటున్నారా.. అనే చర్చ జరుగుతోంది.
Jana Sena
Jana Sena

చంద్రబాబు జనసేనను గతంలో, ఇప్పుడు జనసేనను ఎప్పుడూ వ్యతిరేకంచలేదు. కొంత మంది టీడీపీ నేతలు జనసేనానిని విమర్శించే ప్రయత్నం చేయబోగా, వారిని చంద్రబాబు నిలువరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. అయితే, ఏమైందో ఏమో తెలియదు. కానీ, రోజులు గడిచే కొద్ది టీడీపీతో పవన్ కల్యాణ్ కు దూరం అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే బీజేపీకి కూడా దూరమైన పవన్.. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీతో పాటు వైసీపీని సవాల్ చేసిన పవన్ కల్యాణ్.. ఘోర ఓటమి చెందారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే, టీడీపీని ఓడిస్తానని పేర్కొన్న పవన్.. తాను కూడా అంత కంటే ఘోర ఓటమి పాలవడం గమనార్హం.

కేవలం ఆరు శాతం ఓట్లు సంపాదించిన పవన్.. ఆ తర్వాత కాలంలో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ డెసిషన్ మేకింగ్ అనేది ఫైనల్ గా ఉండబోతున్నది. రాజకీయాల్లో పొత్తులు అనేవి విన్ -విన్ సిచ్యువేషన్ లా ఉండాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ టీడీపీని తీవ్రంగా విమర్శించినప్పటికీ వాళ్లు మళ్లీ పొత్తుకు రెడీ అవుతున్న టైంలో పవన్ కల్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని జనసేన కేడర్ ఎదురు చూస్తోంది.టీడీపీ భావినేత నారాలోకేశ్ పైన పవన్ కల్యాణ్ పలు ఆరోపణలు కూడా చేశారు. అయినా అవేవీ పట్టించుకోకుండా పొత్తుకు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఎటువంటి స్పందన ఇస్తారనేది కీలకంగా మారింది. క్షేత్రస్థాయిలో అనగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీ- జనసేన సహకరించుకున్నట్లు తేలింది. అలా వారు సహకరించుకున్న ప్రాంతాల్లో చక్కటి ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలోనే మళ్లీ టీడీపీ – జనసేన బంధం బలపడితే కనుక
కచ్చితంగా అధికార వైసీపీని ఓడించొచ్చనే అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే, అలా పొత్తులతో ముందుకెళ్తేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించొచ్చనే అభిప్రాయం ఉంది. కానీ, పవన్ కల్యాణ్ గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి సొంతంగా తన బలం తానే పెంచుకోవాలనుకుంటున్నారని జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొత్తుల విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది జనసేనాని ఇష్టమని అనుకుంటున్నారు. చూడాలి మరి.. జనసేన
అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.Also Read:  సినిమా కోసం జీవితాన్నే త్యాగం చేసిన నటుడు ఆయన !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular