SA Vs Ind 2nd Test: కోల్ కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఊహించని విధంగా ఓటమిపాలైంది. అంతేకాదు సిరీస్ 0-1 తేడాతో వెనుకబడిపోయింది.. దీంతో శనివారం నుంచి గుహవాటి వేదికగా మొదలయ్య రెండో టెస్టులో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిల్ కు గాయం తగ్గకపోవడంతో రిషబ్ పంత్ టీమ్ మీడియాకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.. స్వదేశంలో టీమిండియా ఆడుతున్నప్పటికీ.. ఈ మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పడానికి లేదు. ప్లేయర్ల వైఫల్యమే దీనికి కారణం.
Also Read: ‘అఖండ 2’ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కన్నీళ్లు ఆపుకోవడం కష్టమే!
కోల్ కతా టెస్టులో టర్నింగ్ పిచ్ మీద సఫారీ స్పిన్ బౌలర్లు అదరగొట్టారు. ఆతిధ్య భారత జట్టుకు చుక్కలు చూపించారు. గుహవాటి లో కూడా దక్షిణాఫ్రికా అదే జోరు కొనసాగిస్తుందని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు.. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు గుహవాటి లో కూడా గెలిచి పాతిక సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియా గడ్డమీద టెస్ట్ సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ గనుక టీమిండియా కనుక ఓడిపోతే గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తాయి. ఇప్పటికే భారత జట్టు తను ఆడిన చివరి 6 టెస్టులలో నాలుగు ఓడిపోయింది. అంతేకాదు ఏడాదిలోనే రెండవ వైట్ వాష్ కు అత్యంత దగ్గరగా ఉంది.
గిల్ దూరమైన నేపథ్యంలో పతడి స్థానంలో ఎవరు ఆడతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సాయి సుదర్శన్, దేవ దత్ మధ్య విపరీతమైన పోటీ ఉంది.. ఓ అంచనా ప్రకారం సాయికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.. తొలి టెస్ట్ లో టీమిండియా నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు.. రాహుల్, సుందర్ పర్వాలేదనిపించారు.. జైస్వాల్, పంత్, జూరెల్ ఏమాత్రం ఆకట్టుకోలేదు.. పిచ్ పరిస్థితిని అంచనా వేసి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం తెలుస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే అక్షర్ జట్టుకు దూరం కావాల్సి వస్తుంది. బుమ్రా, సిరాజ్ సత్తా చూపిస్తున్నారు. కులదీప్, జడేజా అదరగొడుతున్నారు.
దక్షిణాఫ్రికా జట్టు ఎక్కువగా హర్మర్ మీద ఆధారపడుతోంది. కేశవ్ మహారాజ్ కూడా సత్తా చూపిస్తున్నాడు. గాయంతో ప్రధాన పేస్ బౌలర్ రబాడ ఈ మ్యాచ్ కి కూడా దూరమయ్యాడు.. అయితే యాన్సన్ మాత్రం రబాడ లేని లోటును భర్తీ చేస్తున్నాడు.. బాష్ స్థానంలో ఎంగిడి ఆడే అవకాశం ఉంది.. పర్యాటక జట్టులో కెప్టెన్ మాత్రమే బ్యాటింగ్ ద్వారా సత్తా చూపిస్తున్నాడు.. ఒకవేళ స్టబ్స్, జోర్జి గనక అదరగొడితే పర్యాటక జట్టు బారిష్కరి చేసే అవకాశం ఉంది.
ఇక్కడి పిచ్ ను ఎర్రమట్టితో రూపొందించారు.. పచ్చిక పెరిగితే కాస్త కత్తిరించారు.. అందువల్ల బౌన్స్ కు అవకాశం ఉండొచ్చు. తర్వాత స్పిన్ బౌలర్లు సత్తా చూపిస్తారు. చలికాలం కావడంతో మ్యాచ్ ఉదయం 9 గంటలకే మొదలైంది..