Akhanda 2 Movie First Review: నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన బాలయ్య(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కానుంది. ఈసారి కేవలం తెలుగు భాషలో మాత్రమే కాదు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. విశేషం ఏమిటంటే ఇతర భాషలకు కూడా స్వయంగా బాలయ్య నే డబ్బింగ్ చెప్పాడట. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ నందమూరి ఫ్యాన్స్ ని అయితే సంతృప్తి పరిచింది కానీ, ఆడియన్స్ కి మాత్రం నచ్చలేదు. ఫైట్స్ చాలా అతిగా ఉన్నాయని, గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గానే ఈ సినిమా మొదటి కాపీ మొత్తం సిద్ధం అయ్యింది.
ప్రసాద్ ల్యాబ్స్ లో బాలకృష్ణ మరియు మూవీ టీం తో పాటు, కొంతమంది మీడియా ప్రముఖులు కూడా ఈ సినిమాని వీక్షించారట. వాళ్ళ నుండి లీకైన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ నుండి ఆడియన్స్ ఎలాంటివి ఆశిస్తారో, అలాంటివన్నీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. ఫైట్ సన్నివేశాలు అయితే ‘అఖండ’ కంటే అద్భుతంగా ఉన్నాయని, కానీ అఖండ లో పాటలు బాగుంటాయి, బాలయ్య వేసే స్టెప్పులు కూడా బాగుంటాయి, కానీ ఈ చిత్రం లో అవే మిస్ అయ్యాయి అని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం తల్లి సెంటిమెంట్ అదిరిపోయిందని, అదే సమయం లో బాలయ్య కూతురు సెంటిమెంట్ కూడా బాగుంటుందని అంటున్నారు. చావుకి దగ్గరగా ఉన్న తల్లి, తన పెద్ద కొడుకు చితి పెడితే కానీ, ప్రాణాలను వదలను అని అంటుంది.
అప్పుడు అతని కోసం చిన్న బాలయ్య కుటుంబం మొత్తం హిమాలయ పర్వత ప్రాంతాల్లో వెతకడం మొదలు పెడుతారు. ఈ క్రమం లో జరిగే సంఘటనలే సినిమా అని అంటున్నారు. మాస్ ఆడియన్స్ కి కచ్చితంగా ఈ చిత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ నైజాం, ఓవర్సీస్ ప్రాంతాల్లో మాత్రం ఈ చిత్రం బాగా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడి ఆడియన్స్ కి ఇలాంటి సినిమాలు నచ్చవు. కానీ సీక్వెల్ అవ్వడం తో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలట. ఇది సాధ్యం అవుతుందో లేదో చూడాలి.