Ryan Parag : ఆ సందర్భంలో ఏదైనా జంతువు ఎదురైతే చాలు భీకరమైన పంజా విసురుతుంది. మెడను పట్టి అవలీలగా లాకెళ్తుంది. మెడ నరాన్ని తన పదునైన దంతాలతో చీల్చి పడేస్తుంది. అంతే చూస్తుండగానే ఆ జంతువును తిని పడేస్తుంది. సింహం అలాంటి తాండవాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టే.. పోరాట సింహం అనే నానుడి పుట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై తలపడిన మ్యాచ్లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓ రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. ఆదివారం పోరాట సింహం నానుడిని గుర్తుకు తెచ్చాడు. ఓ వైపు వికెట్లు మొత్తం పడిపోతున్నప్పటికీ రియాన్ పరాగ్ ఒంటరి పోరు కొనసాగించాడు. ఒంటి చేత్తో జట్టు భారాన్ని మోసాడు. కీలక దశలో అవుట్ అయినప్పటికీ..పరాగ్ అందరి మనసులు దోచుకున్నాడు.. సీట్ ఎడ్జ్ వరకు సాగిన ఈ మ్యాచ్లో కోల్ కతా చివరికి ఒక్క పరుగు వ్యత్యాసంతో విక్టరీ సాధించింది.. ప్రస్తుత ఐపీఎల్ లో ఇప్పటి వరకు సాగిన మ్యాచ్లలో..కోల్ కతా, రాజస్థాన్ మధ్య పోరాటం ఆద్వితీయంగా నిలిచిపోయింది. చివర్లో జట్టు విజయానికి మూడు రన్స్ అవసరమైన సందర్భంలో.. రాజస్థాన్ ఆటగాళ్లు క్విక్ డబుల్ తీయడానికి ప్రయత్నించగా.. రెండో పరుగుకు రాజస్థాన్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ రన్ అవుట్ కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ సెన్సేషనల్ విక్టరీ సాధించింది.
Also Read : వాళ్ల వీడియోల కోసం నేను వెతకలేదు. చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు: క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మొయిన్ అలీకి నైట్ మేర్!
రాజస్థాన్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో.. ప్రారంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి మొయిన్ అలీ షాక్ ఇచ్చాడు. దీంతో రాజస్థాన్ జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన రియాన్ పరాగ్.. ప్రారంభం నుంచి దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా మొయిన్ అలీని టార్గెట్ చేయడం ప్రారంభించాడు. అతని బౌలింగ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. మొయిన్ అలీ వేసిన ఒక ఓవర్లో రియాన్ పరాగ్ పాంచ్ పటాకా సాధించాడు. వరుసగా 5 బాల్స్ లో.. 5 చక్కాలు(సిక్సర్లు) కొట్టాడు.. 13 ఓవర్ ను మొయిన్ అలీ వేయగా.. ఫస్ట్ బాల్ హిట్ మేయర్ సింగిల్ పరుగు తీసాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ పోరాట సింహం లాగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఐదు బంతులను బౌండరీలను క్రాస్ చేయించాడు. ఇందులో మోయిన్ అలీ ఓ బంతిని లైన్ తప్పి వేయడంతో అది వైడ్ గా వెళ్ళింది. ఇలా మొత్తంగా 13 ఓవర్లో 32 రన్స్ వచ్చేసాయి ఆ తర్వాత 14 ఓవర్ తొలి బంతికి పరాగ్ రెచ్చిపోయాడు.. ఆ బాల్ ను బౌండరీ క్రాస్ చేయించాడు. ఆ ఓవర్ ను వరుణ్ చక్రవర్తి వేశాడు. ఇలా సిక్స్ బాల్స్ ను సిక్స్ బౌండరీలుగా మళ్ళించాడు. ద్వారా అతడు సెన్సేషనల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరు బాల్స్ కు ఆరు బౌండరీలు సాధించిన ప్లేయర్ గా పరాగ్ రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో కనుక రాజస్థాన్ విక్టరీ సాధించి ఉంటే.. రియాన్ పరాగ్ ఆడిన ఇన్నింగ్స్ కు సార్ధకత లభించి ఉండేది.
Also Read : ధోని చేతిలో ఒదిగిన ఆ బాలుడు.. CSK ను ఓడించాడు!
6 6 6 6 6 6#riyanparag pic.twitter.com/sGysYZQPBG
— Ravish Kumar ᴾᵃʳᵒᵈʸ © (@SirRavishFC) May 4, 2025