Odi World Cup 2023: ప్రస్తుతం అన్ని దేశాల టీములు కూడా వరల్డ్ కప్ ఆడటం లో చాలా బిజీగా ఉన్నాయి.ఇక ఇప్పటికే న్యూజిలాండ్ రెండు మ్యాచ్ లు ఆడితే రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానం లో ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా, పాకిస్థాన్, బాంగ్లాదేశ్, ఇండియా లాంటి టీములు వరుసగా ఒక్కో మ్యాచ్ గెలిచి తలో రెండు పాయింట్లని సంపాదించుకున్నాయి.ఇక ఇలాంటి టైం లో ఇండియన్ టీం వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ వెళ్తే టాప్ పోజొషన్ కి చేరుకోవడం పెద్ద విషయమేమి కాదు. అయితే ఇలాంటి టైం లో మిగితా జట్ల తో పోలిస్తే ఇండియన్ టీం రన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది.కాబట్టి దాన్ని మెరుగు పర్చుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది.ఎందుకంటే అన్ని టీం ల పాయింట్లు ఒకేలా ఉంటె అలాంటి టైం లో సెమిస్ కి వెళ్ళడానికి రన్ రేట్ అనేది చాలా వరకు టీం కి ఉపయోగపడుతుంది.కాబట్టి ఇలాంటి టైం లో ఇండియా మ్యాచ్ లు గెలవడం ఎంత అవసరమో రన్ రేట్ ని మెరుగు పర్చుకోవడం కూడా అంతే అవసరం…
ఇక ఆఫ్గనిస్తాన్ టీం మీద మన ఇండియా టీం చాలా వరకు మంచి విజయాన్ని సాధిస్తుంది అని చెప్పడం లో ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ టీం ఉన్న ఫామ్ కి పెద్ద దేశాలు కూడా ఇండియా టీం ని చూసి భయపడుతుంటే ఆఫ్గనిస్తాన్ లాంటి టీం లు మాత్రం ఏం చేస్తాయి అంటూ చాలా మంది వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…అయితే ఇండియా టీం రన్ రేట్ ని మెరుగు పరుచుకోవడానికి ఈ మ్యాచ్ చాలా వరకు యూజ్ అవుతుంది. కరెక్ట్ గా వాడుకోగలిగితే ఈ మ్యాచ్ ఇండియన్ టీం కి మంచి మ్యాచ్ అవుతుంది.
ఒకసారి 2015 వరల్డ్ కప్ ని కనక చూసుకుంటే గ్రూప్ A నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీంలు సెమి ఫైనల్ కి వెళ్లాయి…ఇక గ్రూప్ దశలో న్యూజిలాండ్ 6 మ్యాచులు ఆడితే 6 మ్యాచులు గెలిచి నెంబర్ వన్ స్థానం లో ఉండి సెమిస్ కి వెళ్తే,ఇక రెండవ పొజిషన్ లో ఉన్న ఆస్ట్రేలియా, నెంబర్ త్రి లో ఉన్న శ్రీలంక టీంలు రెండు కూడా ఆరు మ్యాచుల్లో కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే గెలిచాయి రెండు టీంలు కూడా నాలుగు మ్యాచులు గెలవడం తో ఇక్కడ రన్ రేట్ ని చూడటం జరిగింది.అయితే ఆస్ట్రేలియా రన్ రేట్ +2.257 ఉండగా శ్రీలంక రన్ రేట్ మాత్రం +0.371 గా ఉంది. ఇక దాంతో ఆస్ట్రేలియా టీం సెమిస్ కి వెళ్లడం జరిగింది.
ఇక గ్రూప్ B లో కూడా సేమ్ పరిస్థితి ఇండియా టీం 6 మ్యాచులు ఆడితే 6 మ్యాచుల్లో గెలిచి టాప్ పొజిషన్ లో ఉండగా తర్వాత పొజిషన్ లో మాత్రం సౌత్ ఆఫ్రికా, పాకిస్థాన్ టీములు 6 మ్యాచ్ ల్లో 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి 8 పాయింట్ల తో ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికా టీం రన్ రేట్ +1.707 ఉండగా పాకిస్థాన్ రన్ రేట్ మాత్రం -0. 085 గా ఉంది.ఇక దీనివల్ల ఇండియాతో పాటు గా గ్రూప్ B నుంచి సౌత్ ఆఫ్రికా టీం సెమిస్ కి వెళ్ళింది…
ఇక 2015 వరల్డ్ కప్ అనే కాదు, 2019 వరల్డ్ కప్ లో కూడా పాకిస్థాన్, న్యూజిలాండ్ రెండు టీములు కూడా చెరో 5 మ్యాచులు గెలిచి 11 పాయింట్ల తో ఉన్నప్పటికీ పాకిస్థాన్ కంటే కూడా న్యూజిలాండ్ టీం కి మెరుగైన రన్ రేట్ ఉండటం వల్ల న్యూజిలాండ్ టీం సెమిస్ లోకి వెళ్ళింది…
ఇలా రన్ రేట్ ఎక్కువగా లేకపోవడం వల్లే ప్రతిసారి కూడా చాలా టీములు సెమిస్ కి వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయాయి…అందుకే ఇప్పుడు మ్యాచులు గెలవడం ఎంత ముఖ్యమో రన్ రేట్ ని మెరుగుపరుచుకోవడం కూడా అంతే ముఖ్యం…ముఖ్యంగా చిన్న టీంల మీద మ్యాచులు ఆడినప్పుడు రన్ రేట్ పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో ఇండియా రన్ రేట్ మీద కూడా ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది…