Babar Azam BBL: టి20 క్రికెట్లో వేగానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. అది బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు. ఇలా ఆడే ఆటగాళ్లకు మాత్రమే టి20 క్రికెట్లో అవకాశం లభిస్తూ ఉంటుంది. ఐసీసీ నుంచి మొదలుపెడితే వివిధ దేశాల నిర్వహించే టి20 క్రికెట్ లీగ్ ల వరకు ఇదే సూత్రం వర్తిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ నడుస్తోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ ఆడుతున్నాడు. ఇతడు టి20 క్రికెట్లో సంచలన ప్రదర్శన చేస్తాడని అందరికీ ఒక నమ్మకం ఉంది. కానీ అతడు ఆ నమ్మకాన్ని ప్రస్తుత సీజన్లో కలిగించలేకపోతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ లో విఫలమవుతున్నాడు. ఎందుకు ఇలా ఆడుతున్నాడో.. ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏమాత్రం అర్థం కావడం లేదు.
తాజాగా జరిగిన మ్యాచ్లో అతడు హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చాడు. ఈ దశలో పరుగులు తీసి హాఫ్ సెంచరీ చేయాల్సిన అతడు.. పేలవమైన షాట్ ఆడి అవుట్ అయ్యాడు. అదే కాదు ఫీల్డింగ్ లో కూడా దారుణంగా విఫలం అయ్యాడు. ఒక బంతిని ప్రత్యర్థి బ్యాటర్ బలంగా కొడితే. అది నేరుగా బౌండరీ వైపు పరుగులు పెట్టింది.. దానిని ఆపే క్రమంలో బాబర్ విఫలమయ్యాడు. అంతేకాదు, ఆ బంతిని ఆపడానికి స్మిత్ వస్తే..నువ్వు ఆగు అన్నట్టుగా సైగలు చేశాడు. బాబర్ సైగలు చూసి స్మిత్ ఆగిపోయాడు. చివరికి బాబర్ నిర్లక్ష్యం వల్ల బంతి బౌండరీ వైపు వెళ్ళింది.
ఇలా ఫీల్డింగ్, బ్యాటింగ్ బ్యాటింగ్ లో విఫలం కావడంతో బాబర్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశారని బిగ్ బాష్ లీగ్ నిర్వాకులపై అభిమానులు మండిపడుతున్నారు.. ఇటువంటి ఆటగాళ్ల కంటే.. వర్ధమాన ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే బాగుంటుంది కదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
HUMILIATION FOR BABAR AZAM
Commentator Said : “GET OUT THE WAY, BABAR”
– Babar Azam should have saved the first boundary; however, on the next ball, he ran so fast that he blocked Steve Smith, and the commentators finally said the truthpic.twitter.com/lsLg99Ehy3
— Richard Kettleborough (@RichKettle07) January 16, 2026
“Wasn’t happy, Babar.”
Drama in the middle of the SCG after Steve Smith knocked back a run from Babar Azam, so he could take strike during the Power Surge. #BBL15 pic.twitter.com/rTh0RXE0A5
— KFC Big Bash League (@BBL) January 16, 2026