Gautam Gambhir coaching criticism : ఇప్పటికే టెస్టులలో టీమిండియా నేల చూపులు చూస్తోంది. వన్డేలు, టి20లలో అదరగొడుతున్నప్పటికీ.. సుదీర్ఘ ఫార్మాట్ లో మాత్రం టీం ఇండియా దారుణమైన ప్రదర్శన చేస్తోంది. ఒక రకంగా టీమ్ ఇండియా ఇలా ఆడేందుకు ప్రధాన కారణం గతం గంభీర్ అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఫార్మాట్లో అతడిని కోచ్ స్థానం నుంచి తప్పించాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి. అతని స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంతవరకు మేనేజ్మెంట్ ఎటువంటి ప్రకటనా చేయలేదు..
ఈ విషయాన్ని కాస్త ఆటో ఉంచితే గౌతమ్ గంభీర్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు జాతీయ మీడియాలో విపరీతంగా సర్కులేషన్ లో ఉంది. న్యూజిలాండ్ జట్టుతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లో ఆయుష్ బదోని అనే ఆటగాడికి అవకాశం లభించింది. వాషింగ్టన్ సుందర్ గాయపడిన నేపథ్యంలో బదోని జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడికి జట్టులో అవకాశం రావడం చర్చకు దారి తీసింది. ఎందుకంటే టీమిండియాలో స్థానం కోసం ఎంతో మంది ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు. వారందరినీ కాదని బదోనికి గంభీర్ ఎందుకు అవకాశం ఇచ్చాడనేది అర్థం కావడం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
బదోనిని ఎంపిక చేసిన సెలెక్టర్ల తీరుపై మాజీ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియాన్ పరాగ్, రింకు సింగ్ వంటి ప్లేయర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. వారు డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టారు. అటువంటి ప్లేయర్లను పక్కనపెట్టి బదోనికి అవకాశం ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతుంది. గంభీర్ సపోర్ట్ చేయడం వల్లే బదోనికి జట్టులో చోటు లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. గంభీర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం బాగోలేదని వారు అంటున్నారు.
ఐపీఎల్ లో బదోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. గతంలో గౌతమ్ గంభీర్ లక్నో జట్టుకు మెంటర్ గా వివరించాడు. అతడి శిక్షణలో బదోని పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. బదోని ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గౌతమ్ గంభీర్ కూడా గతంలో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసింది. అందువల్లే బదోని వైపు అతడు ఆసక్తి చూపించాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక ఇదే విషయంపై భారత బ్యాటింగ్ కోచ్ శీతాంశు కొటక్ స్పందించాడు. బదోని ప్రతిభ వల్లే జట్టులోకి తీసుకునామని వెల్లడించాడు. అతడు దేశవాలి క్రికెట్లో స్థిరంగా ఆడుతున్నాడని.. భారత ఏ జట్టు తరఫున వన్డే మ్యాచులు ఆడాడని.. బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేస్తాడని కోటక్ వెల్లడించాడు.
ప్రధాన బౌలర్లలో ఎవరైనా గాయపడితే, వారు వేసే ఓవర్లను భర్తీ చేయడానికి బదోని ముందుంటాడని కోటక్ పేర్కొన్నాడు. అవసరమైతే కీలక ఓవర్లను బదోనికి వేయగలడని కోటక్ పేర్కొన్నాడు.