IPL: ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి.. సంచలనం సృష్టించాడు రవిచంద్రన్ అశ్విన్. అంతేకాదు త్వరలో అతడు ఇంగ్లాండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ టోర్నీలో ఆడబోతున్నాడు.. అయితే అతడు ఏ జట్టుకు ఆడతాడనే విషయంలో క్లారిటీ లేదు. ఐపీఎల్ లో అశ్విన్ 221 మ్యాచ్ లు ఆడాడు. 187 వికెట్లు పడగొట్టాడు. 833 పరుగులు చేశాడు. ఈ చెన్నై ఆటగాడు మాత్రమే కాదట.. ఇంకా కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్ నుంచి వచ్చే సీజన్లో బయటికి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో టీమిండియా లెజెండరీ ప్లేయర్ కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: అశ్విన్ రూటే సపరేటూ.. అప్పుడూ, ఇప్పుడూ..
వచ్చే సీజన్లో ఐపిఎల్ నుంచి బయటికి వచ్చే ఆటగాళ్ల జాబితాలో ధోని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సీజన్లో చెన్నై జట్టుకు తాత్కాలిక సారధిగా వ్యవహరించిన ధోని.. ఒకప్పటి మాదిరిగా తన వ్యూహాలను అమలు చేయలేకపోయాడు. పైగా అతడు మోకాళ్ళ నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు.. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని బయటికి వచ్చాడు. ప్రస్తుతం ధోనికి 43 సంవత్సరాల వయసు ఉంది. బహుశా వచ్చే సీజన్లో అతడు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే అతడు పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చాడు.
ధోని తర్వాత ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్, బ్యాటర్ మోయిన్ అలీ కూడా ఐపీఎల్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సీజన్లో అతడు కోల్ కతా జట్టుకు ఆడాడు. బౌలింగ్లో అద్భుతంగా ప్రతిభ చూపించలేకపోయినప్పటికీ పర్వాలేదు అనిపించాడు. ప్రస్తుతం మొయిన్ అలీ కి 38 సంవత్సరాల వయసు ఉంది. అయితే ఒకప్పటి మాదిరిగా అతడు స్థిరత్వంగా ఆడలేక పోతున్నాడు.. వచ్చే సీజన్లో కోల్ కతా జట్టు యాజమాన్యం అతడిని వదిలేసే అవకాశం కల్పిస్తోంది.
కోల్ కతా జట్టులో మరో ఆటగాడు మనీష్ పాండే కూడా ఐపీఎల్ నుంచి బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సీజన్లో అతడు కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆగాడు. భారత జాతీయ జట్టుకు అతడు ఎప్పటినుంచో దూరంగా ఉంటున్నాడు.. వచ్చే సీజన్లో అతడిని వదిలేయాలని కోల్ కతా జట్టు భావిస్తోంది. బహుశా అతడు ఐపీఎల్ నుంచి వచ్చే సీజన్లో రిటైర్ కావచ్చని తెలుస్తోంది.
భారత జాతీయ జట్టులో లెజెండరీ బౌలర్ గా పేరుపొందిన ఇషాంత్ శర్మ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ జట్టు తరఫున ఆడాడు. అతడు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే సొంతం చేసుకున్నాడు. ఎకానమీ రేటు కూడా 11 కు పైగా ఉంది. వయస్సు, శరీర సామర్థ్య సమస్యలు వంటివి ఇషాంత్ శర్మ ను ఇబ్బందికి గురిచేస్తున్నాయి.. అందువల్లే అతడు వచ్చే సీజన్లో ఐపిఎల్ నుంచి బయటికి రావచ్చని తెలుస్తోంది.