https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ : డేవిడ్ వార్నర్ సర్ ప్రైజ్

  ఐపీఎల్ లో ఇన్నాళ్లు ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ కెప్టెన్ గా వెలుగు వెలిగారు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్. అయితే ఈ ఐపీఎల్ లో ఫాం కోల్పోవడంతో కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. కానీ అంతకుముందు హైదరాబాద్ ను ధీటుగా నిలిపి సెమీస్ కు చేర్చిన ఘనుడు మన డేవిడ్ భాయ్. కరోనా లాక్ డౌన్ వేళ సన్ రైజర్స్ హైదరాబాద్ కు మద్దతుగా మన తెలుగు హీరోల పాటలపై డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2021 / 09:07 AM IST
    Follow us on

     

    ఐపీఎల్ లో ఇన్నాళ్లు ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ కెప్టెన్ గా వెలుగు వెలిగారు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్. అయితే ఈ ఐపీఎల్ లో ఫాం కోల్పోవడంతో కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. కానీ అంతకుముందు హైదరాబాద్ ను ధీటుగా నిలిపి సెమీస్ కు చేర్చిన ఘనుడు మన డేవిడ్ భాయ్.

    కరోనా లాక్ డౌన్ వేళ సన్ రైజర్స్ హైదరాబాద్ కు మద్దతుగా మన తెలుగు హీరోల పాటలపై డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ లు ఎంతో వైరల్ అయ్యాయి. తెలుగు ప్రజలకు దగ్గర అయ్యేందుకు వార్నర్ చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు.. టాలీవుడ్ హీరోలను ఫాలో అవుతూ వారి పాటలకు తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ ఆశ్చర్యపరిచాడు.

    గతంలో మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ ముఖాలను రీఫేస్ యాప్ ద్వారా మార్ఫింగ్ చేసి వార్నర్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

    తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎన్టీఆర్, రాంచరణ్ ఫొటో విడుదలైంది. ఇద్దరూ బైక్ మీద వెళుతున్న ఫొటో వైరల్ అయ్యింది. ఈ ఫొటోను సైతం మార్ఫింగ్ చేసిన డేవిడ్ వార్నర్ .. ముందు ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తున్న ఫొటోను సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిన కేన్ విలయమ్సన్ ను పెట్టారు. వెనుకాల రాంచరణ్ ప్లేసులో డేవిడ్ వార్నర్ మార్ఫింగ్ ఫొటోను పెట్టారు.

    ఈ మార్ఫింగ్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు చూసిన వెంటనే అభిమానులు కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై సన్ రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ కామెంట్ చేశాడు. ‘హెల్మెట్ గైస్’ అంటూ ట్రోల్ చేశారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది.