RR vs SRH Match Preview: ఐపీఎల్ సంరంభం కొనసాగుతోంది. ఆట ఆరంభమైంది. జట్లు తమ విజయయాత్ర కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సన్ రైజర్స్ కూడా తన పోరుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తో పుణే వేదికగా నేడు మొదటి ఆట ప్రారంభం కానుంది. అభిమానులకు పరుగుల విందు చేయనుంది. దీంతో భారీ అంచనాలతో హైదరాబాద్ సన్ రైజర్స్ పోరుకు సిద్ధం అయింది. ఫ్రాంచైజీ తన ప్రేక్షకుల ముఖాల్లో చిరునువ్వులు కురిపించేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది.
కేన్ విలియమ్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. విజయాలే లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను ప్రణాళికలు రచిస్తోంది. కెప్టెన్ కేన్ యువప్లేయర్ అభిషేక్ శర్మతో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేన్ ప్రతిభ అందరికి తెలిసిందే. గత సీజన్లలో 17 మ్యాచుల్లో 735 పరుగులు చేయడం గమనార్హం. దీంతో కేన్ మామతో పాటు ఫస్ట్ డౌన్ లో రాహుల్ త్రిపాఠి రానున్నట్లు సమాచారం.
Also Read: Telugu Desam Party: నాలుగు దశాబ్దాల పయనం…పడిలేస్తూ..లేచిపడుతూ ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ
ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడన్ మార్కరమ్ రానున్నాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ నికోలస్ పూరస్ వచ్చే అవకాశం ఉంది. దీంతో సన్ రైజర్స్ దూకుడుగా ఆడేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో సన్ రైజర్స్ అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఇటీవల భారత్ వేదికగా జరిగిన టీ 20 మ్యాచుల్లో రాణిస్తున్న హిట్టర్ అబ్దుల్ సమద్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు స్పిన్నర్లు తీసుకుంటే వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ గోపాల్ లకు అవకాశం రానుంది. సుందర్ తన అద్భుత ప్రదర్శనతో చెలరేగేందుకు ప్రాక్టీసు చేస్తున్నాడు. అయితే సన్ రైజర్స్ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తప్పులు చేయకుండా విజయం సాధించేందుకు వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా బరిలో నిలిచి ఫ్రాంచైజీ పరువు నిలబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.