BJP Focus On Telangana: తెలంగాణలో మొన్నటి వరకు స్టేట్ లెవల్ లీడర్లు కుస్తీ పట్టారు. కానీ ఇక నుంచి జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు. వారంతా తెలంగాణ గడ్డమీద నువ్వా నేనా అన్నట్టు తలపడబోతున్నారు. దీంతో తెలంగాణ జాతీయ స్థాయిలో రాజకీయాలకు కేంద్ర బిందువు కాబోతోంది. కేసీఆర్ ను గద్దె దించాలని ఇప్పటికే బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. కేసీఆర్ కేంద్రంపై ఒంటికాలిమీద లేవడంతో.. అమిత్ షా, మోడీలు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే అమిత్ షా తెలంగాణకు రెండు సార్లు రావాలని అనుకుంటున్నారు. రెండో విడత బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభోత్సవానికి వచ్చి సంజయ్ పాదయాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాలని భావిస్తున్నారు.
Also Read: Telugu Desam Party: నాలుగు దశాబ్దాల పయనం…పడిలేస్తూ..లేచిపడుతూ ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ
మరోసారి శ్రీరామ నవమి రోజున వస్తున్నారు. ఆరోజు ఆధ్యాత్మిక యాత్రను చేపట్టనున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఏప్రిల్ నెలలో భారీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ తన బల ప్రదర్శన చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. రాహుల్‌ను రాష్ట్రానికి రప్పించి తన బలమేంటో చూపించాలని కసి మీద ఉన్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులతో ఓ సభ నిర్వహించాలని చూస్తున్నారు.
ఇక కేజ్రీవాల్ కూడా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఆయన కూడా ఏప్రిల్ లోనే రాష్ట్రానికి వస్తున్నారు. తెలంగాణలో పాదయాత్ర చేసే అవకాశం కూడా ఉంది. విచిత్ర ఏంటంటే.. అమిత్ సా వస్తున్న ఏప్రిల్ 14న కేజ్రీవాల్ కూడా వస్తున్నారు. ఇలా జాతీయ స్థాయి నాయకులంతా తెలంగాణలో మకాం వేయనున్నారు.
ఇన్ని రోజులు జాతీయ స్థాయిలో విమర్శలు గుప్పించుకున్న వీరంతా.. త్వరలోనే తెలంగాణ వేదికగా పోటీ పడబోతున్నారు. మరి ఇంతమంది జాతీయ నాయకులు వచ్చి టీఆర్ ఎస్ ప్రభుత్వం మీద విరుచుకు పడితే.. ప్రభావం వేరే లెవల్ లో ఉంటుంది. కేజ్రీవాల్ లాంటి నేతలు వచ్చి విమర్శలు చేయడం అంటే ఎంతో కొంత టీఆర్ ఎస్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేకపోలేదు.
మరి ముప్పేట ముంచుకొస్తున్న దాడిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరంతా కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారా.. లేక పనిలో పనిగా ఒకరి మీద మరొకరు విమర్శలు గుప్పించుకుంటారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా చూస్తుంటే.. తెలంగాణ కేంద్రంగా జాతీయ స్థాయి నేతలు కుస్తీ పట్టబోతున్నారన్న మాట.
Recommended Video: