Royal Challengers Bangalore: బెంగళూరు జట్టు కు అపారమైన అభిమాన గణం ఉంది. విశేషమైన వనరులు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం బెంగళూరు జట్టు టైటిల్ సాధించింది. కానీ పురుషుల టోర్నీలో మాత్రం ఇంతవరకు విజేతగా నిలవలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఫైనల్ దాకా రావడం.. ఫైనల్లో ఓడిపోవడం.. ఇంకొన్ని సందర్భాల్లో ప్లే ఆఫ్ దాక రావడం.. ఇంటికి వెళ్లిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నా. అయినప్పటికీ వెన్ను అనేది చూపించకుండా గత 18 ఎడిషన్లుగా బెంగళూరు ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా ఐపీఎల్ ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ కూడా వారు తమ పోరాటపటిమను వదిలిపెట్టలేదు. తధానంగా ఐపీఎల్ లో విపరీతమైన అభిమానులు ఉండే జట్లుగా చెన్నై, ముంబై పేరుపొందాయి. ఎందుకంటే ఈ రెండు జట్లు కూడా చెరి ఐదుసార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచాయి. కానీ బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేత కాలేకపోయినప్పటికీ.. ఈ రెండు జట్లకు మించి అభిమాన గణాన్ని కలిగి ఉంది. ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో అన్ బాక్స్ పేరుతో వేడుక నిర్వహిస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమానికి అభిమానులందరికీ ఆహ్వానాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమంలో అభిమానులను ఆకట్టుకునే విధంగా సంబరాలు జరుపుతూ ఉంటుంది. ఆ కార్యక్రమానికి బెంగళూరు జట్టు ఆటగాళ్లు మొత్తం హాజరవుతుంటారు. అట్టహాసమైన వేడుకలాగా దానిని నిర్వహిస్తూ ఉంటుంది.
Also Read: ఆ ఒక్క పరుగు చేసి ఉంటే.. రాజస్థాన్ రాజసం నిలబడేది..
ట్రోలింగ్ చేస్తే..
సాధారణంగా బెంగళూరు జట్టుకు విపరీతమైన అభిమానులు ఉంటారు. బెంగళూరు ఆటగాళ్ల కంటే కూడా ఎక్కువగా జట్టును ప్రేమిస్తుంటారు. జట్టు ఎక్కడ ఆడితే అక్కడికి వెళ్తుంటారు. పొరపాటున ప్రత్యర్థి జట్టు అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కనక చేస్తే ఏమాత్రం ఊరుకోరు. రీసెంట్ గా జరిగిన ఓ మ్యాచ్లో బెంగళూరు జట్టు విక్టరీని ఓర్వలేక
చెన్నై అభిమానులు తమ నోటికి పని చెప్పారు. ఇక బెంగళూరు అభిమానులు తమ నోటికి కాదు చెయ్యికి కూడా పని చెప్పారు. తద్వారా తమది డై హార్డ్ కోర్ ఫ్యాన్ ఇజం అని నిరూపించారు. అయితే బెంగళూరు జట్టు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. కానీ ఇక్కడే ఆ జట్టుకు సంబంధించి వ్యాపార కిటుకు ఉంది. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ అయితే.. ఆ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. అందువల్లే తమకు ఎదురవుతున్న ట్రోలింగ్ ను వ్యాపారంగా మలచుకుంటుంది బెంగళూరు యాజమాన్యం. 2024 సీజన్లో బెంగళూరు జట్టు మొదట్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొంది. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడింది. ఏకంగా ప్లే ఆఫ్ దాకా వెళ్ళిపోయింది. ఒకానొక దశలో ఫైనల్ వెళ్లి.. ట్రోఫీ అందుకుంటుందని అంచనాలు ఉన్నాయి. కానీ ప్లే ఆఫ్ లో బెంగళూరు ఓటమిపాలైంది. ఇదే క్రమంలో గత సీజన్లో బెంగళూరు జట్టు 650 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇందులో నికర లాభం 222 కోట్లు అని బెంగళూరు యాజమాన్యం ప్రకటించింది. అంటే దీనిని బట్టి బెంగళూరు యాజమాన్యం తమ వ్యాపారాన్ని ఏ విధంగా చేసిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జెర్సీల విక్రయం.. ప్రకటనలు.. సోషల్ మీడియా ప్రచారం వల్ల బెంగళూరు జట్టు బీభత్సమైన ఆదాయాన్ని సంపాదించింది. ఇదే సమయంలో ఆదాయానికి తగ్గట్టుగానే భారీగా లాభాన్ని నమోదు చేసింది. గత సీజన్లో విజేతగా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు లాభాలకు దరిదాపుల్లో బెంగళూరు ప్రాఫిట్స్ ఉండడం విశేషం. అందుకే సోషల్ మీడియాలో బెంగళూరు ఐటి టీం విపరీతమైన యాక్టివ్ గా ఉంటుంది. సరికొత్త ఐడియాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఇక ఈ సీజన్లో బ్లింక్ ఇట్ వంటి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని.. విభిన్నంగా ప్రచారం చేసింది. ఐపీఎల్ కు మరింత వ్యాప్తి దక్కేలా చేసింది.