https://oktelugu.com/

Pushpa 2: The Rule : పుష్ప 2 కాంట్రవర్సీ సమయంలో పర్ఫెక్ట్ సాంగ్ తో వచ్చిన డిఎస్పీ…ఈ పాట తో ట్రోలర్స్ కి ఇచ్చి పడేశాడుగా..

పుష్ప 2 సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2024 / 07:09 PM IST

    Pushpa 2

    Follow us on

    PuPushpa 2: The Rule  పుష్ప 2 సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రేక్షకుడికి నచ్చే ప్రతి అంశాన్ని ఇందులో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన సుకుమార్ తో మొదటి నుంచి డిస్కషన్ చేస్తూ వస్తున్నాడట. ఇక ఎట్టకేలకు అల్లు అర్జున్ హీరోయిజన్ని బాగా ఎలివేట్ చేస్తూ ఈ సినిమా మొత్తం సాగబోతుందనే విషయాన్ని కూడా దర్శకుడు సుకుమార్ చెప్పకనే చెప్పాడు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయనలాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాతో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక అందులో భాగంగానే పుష్ప 2 సినిమాకు సంబంధించిన పీలింగ్స్ అనే సాంగ్ ని కొద్దిసేపటికి క్రితమే రిలీజ్ చేశారు. ఇక లిరికల్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ మంచి మాస్ బీట్లతో అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో ఇటు అల్లు అర్జున్ అటు రష్మిక మందాన ఇద్దరు కూడా దుమ్ము దులిపేశారనే చెప్పాలి. నిజానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది చాలా మంచి కిక్ ఇచ్చే సాంగ్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    చాలా రోజుల నుంచి అల్లు అర్జున్ సినిమాలో పెద్దగా డాన్స్ లైతే వేయడం లేదు అంటూ చాలామంది కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. కానీ ఈ పాటలో ఆయన మంచి స్టెప్స్ వేస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహాన్ని తెప్పించే విధంగా ఆయన స్టెప్స్ వేశాడు. ఒకప్పటి అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్ లైతే వేసేవాడో ఇప్పుడు కూడా అలాంటి స్టెప్స్ వేస్తూ దుమ్ము దులిపేసాడు.

    మొత్తానికైతే ఆయన వేసిన స్టెప్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మీద హైప్ ను కూడా పెంచుతున్నాయనే చెప్పాలి. ఇక ఈ పాట విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ ఈ పాటలో ఒక మాస్ బీట్ ఉండేలా చూసుకుంటూనే కంప్లీట్ డ్యూయట్ సాంగ్ లా కాకుండా కొత్తగా ప్లాన్ చేశాడు.

    ఇక గత కొన్ని రోజుల నుంచి ఆయన్ని ట్రోల్ చేసేవారికి ఈ పాటతో గట్టి కౌంటర్ ఇచ్చాడు…ఇక ఈ పాట థియేటర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు పూనకలు తెప్పించడం పక్కా అంటూ అల్లు అర్జున్ అభిమానులు సందడి చేసుకుంటున్నారు…