MI Vs RR 2024: ఇటీవల బెంగళూరు ఆడిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగుతుండగా.. ఓ అభిమాని మైదానంలోకి వచ్చాడు. సెక్యూరిటీ కళ్ళు గప్పి అతడు నేరుగా మైదానంలోకి వెళ్లి విరాట్ కోహ్లీ కాళ్లకు నమస్కరించాడు. దీంతో ఆ సంఘటన చర్చనీయాంశంగా మారింది. తన కాళ్లకు మొక్కడాన్ని విరాట్ వారించాడు. ఆ తర్వాత విషయం తెలుసుకొని గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని బయటకు తీసుకెళ్లారు. అతడికి దేహశుద్ధి చేశారని వార్తలు వినిపించాయి. దీంతో చాలామంది బెంగళూరు జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
తాజాగా సోమవారం ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోనూ అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ముంబై జట్టు బౌలింగ్ చేస్తున్న క్రమంలో.. ఓ అభిమాని ఆకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్న చోటుకు వెళ్లి రోహిత్ భయ్యా అంటూ అతడిని పలకరించాడు. దెబ్బకు రోహిత్ భయపడిపోయాడు. రెండు అడుగులు వెనక్కి వేశాడు. అనంతరం ఆలింగనం చేసుకుని బయటికి పంపించాడు. రోహిత్ పక్కనే ఉన్న ఈశాన్ కిషన్ ను కూడా ఆ అభిమాని ఆలింగనం చేస్తున్నాడు. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ ఘటన అనంతరం రోహిత్ శర్మ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. తనలో తాను నవ్వుకున్నాడు.. ఈ మాత్రం దానికే ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు భయపడ్డాను అంటూ హావభావాలు పలికించాడు.
కాగా ఈ మ్యాచ్లో ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 34, తిలక్ వర్మ 32 మాత్రమే మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్డ్ 3, చాహల్ 3, బర్గర్ రెండు, ఆవేష్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 15.3 ఓవర్లలోనే విజయం సాధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలుపును అందుకుంది.
A fan entered into the ground & hugged Rohit Sharma in Wankhede…!!!!pic.twitter.com/tWDVtfQYmD
— Johns. (@CricCrazyJohns) April 1, 2024