Rohit Sharma
Rohit Sharma: కెప్టెన్సీ బాధ్యతలు చాలా కష్టమైనవని టీమిండియా సారథి రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నిపండం, వారిపై నమ్మకం ప్రదర్శించడా కెప్టెన్‌గా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘నిర్ణయాలు తీసుకోవడంలో సారథి బాధ్యతలు’, ’ఓపెనర్‌గా జట్టులో పాత్ర’ అనే అంశాలపై రోహిత్ శర్మ మాట్లాడారు.
‘జట్టుకు నాయకత్వం వహించయడం ఎప్పుడూ కత్తిమీది సామే. బయటి నుంచి చూసేవారికి ఈజీగా అనిపిస్తుంది. కెప్టెన్ ఒక ఆలోచనా విధానంతో నడవాలి. అభిమానులు మాత్రం అనుకున్నదే కోరుకుంటారు. జట్టుగా ఆడాల్సిన గేమ్ క్రికెట్. టీమ్‌లోని అందరి సహకారం చాలా ముఖ్యం. నా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఆరు లే0దా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కనీసం పది బంతులు ఆడినా సరే.. మ్యాచ్ విన్నింగ్‌లో అవే కీలకం. ఇదంతా జరగాలంటే ఆటగాళ్లే కీలకం. ఇదంతా జరగాలంటే.. సారధిగా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాలి. తుది జట్టులోని 11 మంది తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలి’ అని రోహిత్ వివరించారు.
ప్రతీ ఆటగాడితో మాట్లాడి..
కెప్టెన్‌గా తాను ప్రతీ ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడతానని తెలిపారు. వారితో కలిసి డిన్నర్ చేస్తానని వెల్లడించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సారథిగా నా సాయం కోసం చూస్తారన్నారు. అలాంటి సమయంలో అందుబాటులో లేకుంటే అసౌకర్యంగా భావిస్తారని తెలిపారు. అందరికీ సమ ప్రాధాన్యం ఇవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. జట్టులో ఎవరి పాత్ర ఏమిటో నిర్ణయించేది కూడా సారథే అన్నారు. ఎవరినైనా తుది జట్టు నుంచి తప్పించాలనకుంటే.. అప్పుడు కెప్టెన్ నిర్ణయమే కీలకం అవుతుందని తెలిపాడు. ఆ సమయం చాలా క్లిష్టమైనదన్నారు. ఆటగాళ్లతో మాట్లాడి ఒప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
ఓపెనర్ గా..
ఇక ఓపెనర్‌గా తన బాధ్యతలను సైతం రోహిత్ వివరించాడు. ‘ఓపెనర్‌గా ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా జట్టు పైచేయి సాధించేందుకు వ్యవహరిస్తా. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటా. ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు కష్టంగా ఉంటుంది. పిచ్ ఎలా స్పందిస్తుందో తెలియదు. అందుకే ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాల్సి ఉంటుంది. ప్రతి మ్యాచ్‌కు ముందు కఠోర సాధన చేస్తా. తొలి ఓవర్‌లోనే షాట్ కొట్టాలని భావిస్తే దానికోసం ముందే ప్రాక్టిస్ చేస్తా. షాట్ కొట్టడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇన్నింగ్స్‌పైనా ప్రభావం చూపుతుంది’ అని హిట్ మ్యాన్ వివరించాడు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rohit sharma sensational statement on captaincy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com