Animals: ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఆకలి అనేది కామన్. ఆకలి తీర్చుకోవడం కోసం జీవులు రకరకాల ఆహార పదార్థాలను ఆరగిస్తాయి. కొన్ని జీవులు పూర్తి శాకాహారులుగా ఉంటే.. మరికొన్ని జీవులు పూర్తి మాంసాహారులుగా ఉంటాయి. మొక్కలు, సముద్రంలో ఉండే శైవలాలు, శిలీంద్రాలు మినహా మిగతావన్నీ తమ ఆకలి తీర్చుకోవడం కోసం మిగతా వాటిపైన పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆధారపడేవే. ఈ జాబితాలో కొన్ని జీవులు పగటిపూట తమ ఆకలి తీర్చుకుంటే.. కొన్ని జీవులు రాత్రిపూట తీర్చుకుంటాయి. ఇక ఈ జీవజాలంలో కొన్ని జంతువులు వేట ద్వారా వాటి ఆకలి తీర్చుకుంటాయి. ఇలాంటి జంతువుల్లో కొన్ని రాత్రిపూట వేటాడుతాయి. ఆ వేట ద్వారానే తమ ఆకలి తీర్చుకుంటాయి. అయితే పగటిపూట సూర్యుడి కాంతి వల్ల వాతావరణం పారదర్శకంగా ఉంటుంది కాబట్టి జంతువులు వేటాడేందుకు వీలుగా ఉంటుంది. చీకట్లో మాత్రం వేటాడడం దాదాపుగా అసాధ్యం. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఈ జంతువులు చీకట్లోనే వేటాడుతాయి.
గుడ్లగూబ
ఇది నిశాచార జీవి. మాంసాహార జీవి కూడా. ఇది పగలు మొత్తం విశ్రాంతి తీసుకొని.. రాత్రి మాత్రమే వేటాడుతుంది. దీని నేత్రాల్లో ఉండే ప్రత్యేక నిర్మాణం వల్ల అది పగలు కూడా స్పష్టంగా చూడగలుగుతుంది. అంతేకాదు తన తలను 270 డిగ్రీల వరకు తిప్పి చూడగలదు. ఇది చిన్న చిన్న పురుగులను, కొన్ని రకాల కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. ప్రధానంగా ఇవి చెట్ల పైన నివసిస్తాయి.. పంటల కోతల కాలంలో ఎక్కువగా వేటాడుతాయి. ఎందుకంటే ఆ సమయంలో పురుగులు ఎక్కువగా బయటకు వస్తాయి కాబట్టి..
పిల్లి
పులి జాతికి చెందిన పిల్లి కండ్లు రాత్రిపూట మిలమిలా మెరుస్తాయి. ఇది రాత్రిపూట కూడా అత్యంత స్పష్టంగా చూడగలుగుతుంది. అందుకే ఇది చీకట్లో కూడా వేటాడగలుగుతుంది. వేటాడిన జంతువును నోట కరుచుకుని దూరంగా తీసుకెళ్లి తింటుంది. అలా తిన్న అనంతరం దాని అవశేషాలు ఏమైనా ఉంటే రెండు కాళ్లతో చిన్నపాటి గొయ్యి తీసి అందులో పెడుతుంది.
గబ్బిలం
ఇది కూడా పూర్తి మాంసాహార జీవి.. దీనికి రెక్కలాంటి అవయవాలుంటాయి. వాటి సహాయంతో ఇది ఎగర కలుగుతుంది. ఇది నిశాచార జీవి. వేట కోసం ఎంత దూరమైనా వెళుతుంది. చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.. గబ్బిలాలు సమూహంగా జీవిస్తుంటాయి. ఆహార అన్వేషణలో భాగంగా ఇవి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి జీవశాస్త్ర పరిభాషలో వీటిని పరాన జీవుల ప్రాథమిక అతిథులు అంటారు.
నక్క
నక్క చీకట్లో వేటాడగలదు. పులి, సింహం వంటి జంతువులు వేటాడి తినగా మిగిల్చిన మాంసాన్ని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. సమూహంగా ఉంటాయి కాబట్టి ఎదురుగా ఉండే జంతువుపై ఒకేసారి మీద పడుతుంటాయి. తమ నోట్లో ఉన్న పదునైన దంతాలతో ఎదుటి జంతువు శరీరాన్ని చీల్చుతాయి.. ఆ జంతువు మాంసాన్ని పీకి పీకి తింటాయి. కఠినమైన చీకట్లోనూ నక్క కళ్ళు అత్యంత పారదర్శకంగా కనిపిస్తాయి.
తోడేలు
క్రూరమైన వేటకు ఈ జంతువులు పర్యాయపదం. అత్యంత పదునైన దంతాలు కలిగి ఉండటంతో ఒకేసారి ఎదుటి జంతువు మీద పడతాయి. ఒక్కో తోడేలు ఒక్కో భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లడంతో ఆ జంతువు వెంటనే కన్నుమూస్తుంది. కన్నుమూసిన వెంటనే ఇవి ఊలలు వేస్తూ మాంసాన్ని ఆరగిస్తాయి. తోడేళ్ళు వాసన, కదలికల ఆధారంగా ఎదుటి జంతువు ఆనవాళ్లను కనిపెడతాయి. ఇవి సమూహంగా ఉండి ఎదుటి జంతువు వేటాడిన మాంసాన్ని కూడా లాక్కుంటాయి. పులి, సింహం లాంటి జంతువులు కూడా తోడేళ్ల మందను చూసి భయపడతాయంటే అతిశయోక్తి కాదు.
పులి
చీకట్లోనూ అత్యంత క్రూరంగా వేటాడగలిగే జంతువు పులి. దీని కళ్ళు చీకట్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ప్రత్యేక జంతువు మీద భయంకరంగా దాడి చేస్తుంది. తన పదునైన దంతాలతో మెడను నోట కరచి లాగేస్తుంది. అది చనిపోయిన అనంతరం దాని మాంసాన్ని చీల్చి చీల్చి తింటుంది. వాసన ద్వారా ప్రత్యర్థి జంతువు జాడను పులి ఇట్టే పసిగట్టగలుగుతుంది. పైగా అత్యంత వేగంగా పరిగెత్తగలుగుతుంది కాబట్టి ప్రత్యర్థి జంతువు పులి బారి నుంచి తప్పించుకోలేదు.
హైనాలు
ఈ భూమి మీద ఉన్న ప్రమాదకరమైన జంతువుల్లో ఇవి కూడా ఒకటి. ఇవి మనుషులపై కూడా దాడి చేస్తాయి. మూకుమ్మడి అనే పదానికి ఇవి పర్యాయంగా ఉంటాయి.. పదునైన దంతాలతో ఎదుటి జంతువులను ఊరికనే చంపేస్తాయి. చంపేసిన వెంటనే తినేస్తాయి. క్రూరమైన పులులు, సింహాలు చంపేసిన జంతువులను వాటి నుంచి లాగేసుకోవడానికి కూడా ఇవి వెనుకాడవు. ఈ జంతువుల కండ్లు అత్యంత పారదర్శకంగా కనిపిస్తాయి కాబట్టి చీకట్లో కూడా వేటాడుతాయి.
సాలీడు
ఇవి చూసేందుకు చిన్న జీవులే అయినప్పటికీ రాత్రిపూట కూడా తమ ఆకలి తీర్చుకునేందుకు చిన్నచిన్న పురుగులను తింటాయి. నోటి ద్వారా వచ్చే లాలాజలంతో ప్రత్యేకంగా గూళ్ళను నిర్మించుకుంటాయి. ఆ గూళ్ళ ద్వారా చిన్న చిన్న కీటకాలను ఆకర్షించి.. తమ వద్దకు రాగానే నోటితో తినేస్తాయి. ముఖ్యంగా ఇవి రాత్రిపూట వాటి ఆకలిని తీర్చుకుంటాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: These animals also hunt at night
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com