Rohit Sharma: ఇప్పటివరకు ఇండియన్ టీమ్ లో చాలామంది ప్లేయర్లు మంచి పర్ఫామెన్స్ ను ఇచ్చి అద్భుతమైన విజయాలను ఇండియన్ టీమ్ కి అందించారు. ఇక చాలా సంవత్సరాల పాటు ఇండియన్ టీమ్ కి సేవలను కూడా చేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు…ఇక కొందరు ఇప్పటికే ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి మరికొందరు మాత్రం రిటైర్ మెంట్ ప్రకటించి పరోక్షంగా క్రికెట్ కి హెల్ప్ చేసే ప్రయత్నమైతే చేస్తున్నారు…
ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉంది. వరుసగా మ్యాచ్ లను గెలుచుకుంటూ రావడమే కాకుండా ఇండియన్ టీమ్ పవర్ ఎంటో ప్రతి దేశానికి తెలియజేస్తూ వస్తున్నారు. ఇక ముఖ్యంగా మన ప్లేయర్లు అయితే ఆకాశమే హద్దుగా ఆడుతూ మన టీమ్ కి చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. ఇక మూడు ఫార్మాట్లల్లో కూడా మన వాళ్ళు సత్తా చూపించడమే కాకుండా భారీ రేంజ్ లో గెలిచే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సీనియర్ ప్లేయర్లు కుర్ర ప్లేయర్లు కలిసి మ్యాచ్ మొత్తాన్ని విజయం దిశగా నడిపించే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ సడన్ గా తన రిటైర్ మెంట్ ను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. ఇక మొత్తానికైతే ఇక మీదట ఆయన ఇంటర్నేషనల్ మ్యాచ్ లను ఆడలేడు. కాబట్టి ఆయన రిటర్మెంట్ మీద చాలామంది ఎమోషనల్ అయ్యారు…ఇక నిజానికి ఎలాంటి క్లూ ఇవ్వకుండా రిటర్మెంట్ ప్రకటించడం పట్ల కొంతమంది క్రికెటర్లు సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మంచి స్పిన్నర్ కాబట్టి ఆయన టీమ్ లో ఉండడం వల్ల టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలైతే ఉంటాయి.
కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయన రిటైర్ మెంట్ ప్రకటించడం అనేది చాలా బాధాకరం అంటూ సీనియర్ ప్లేయర్లు సైతం అశ్విన్ యొక్క ప్రతిభను కొనియాడుతున్నారు… ఇక ఇదిలా ఉంటే అశ్విన్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆయన రిటర్మెంట్ పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆయన మరికొన్ని రోజులు ఇండియన్ టీమ్ కి తన సేవలను అందిస్తే బాగుండేది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఇదే సందర్భంలో రహనే, పుజారా ల మ్యాటర్ కూడా తెర మీదకి వచ్చింది. వాళ్ళు కూడా ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు కదా అన్న ప్రశ్నకి రోహిత్ శర్మ సమాధానంగా వాళ్లు ఇంకా ఇంటర్నేషనల్ టీమ్ లో ఆడేందుకు వాళ్లకు తలుపులు తెరిచే ఉన్నాయి. రహనే, పుజారా లు ఇద్దరు నాకు చాలా మంచి ఫ్రెండ్స్..ఇక రహానే ను తరచుగా ముంబైలో కలుస్తూ ఉంటాను.
పుజారా రాజ్ కోట్ లో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలువలేకపోయినా కూడా ఆయన నాకు మంచి మిత్రుడు అంటూ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. ఇక మొత్తానికైతే రోహిత్ శర్మ రహనే పుజారా లను కూడా టీమ్ లోకి ఆహ్వానిస్తున్నాడు కానీ వాళ్ళు వాళ్ళ ఫామ్ ను నిరూపించుకొని సెలెక్టర్లను మెప్పించాల్సిన అవసరమైతే ఉంది…