Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమైతే లేదు. ఇండియన్ టీమ్ కి గత కొద్ది సంవత్సరాలు నుంచి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ఇంటర్ నేషనల్ ఫార్మాట్ కి రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆయన్ని తన రిటైర్మెంట్ గురించి అడగగా ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పినట్టుగా తెలియజేశాడు. అలాగే ఐపీఎల్ లో ఇకమీదట ముందుకు కొనసాగుతారా లేదంటే ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా అని కొంతమంది రిపోర్టర్స్ తనని అడగగా, ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఐపీఎల్ లో చెన్నై టీమ్ తరఫున చాలా ఎక్కువ సంవత్సరాలపాటు ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నాను. నన్ను ఐపిఎల్ లో చాలా ఎక్కువ సంవత్సరాలు పాటు మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది… ఇకమీదట నా దృష్టి మొత్తం ఐపిఎల్ మీదనే ఉంటుంది. ఐపీఎల్ లో నేను ఏ జట్టు తరపున ఆడిన కూడా దానికి పూర్తి బాధ్యతను వహిస్తానని చెబుతూ వచ్చాడు.
ఇక రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రవిచంద్రన్ అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అందుకే ఆయన చెన్నై టీమ్ తరపున తన చివరి శ్వాస వరకు ఆడతానని చెబుతుండటం విశేషం… నిజానికి మొదట చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నుంచే ఐపిల్ ఆడాడు. అక్కడి నుంచి ఆయనకు మంచి గుర్తింపు లభించడంతో ఇంటర్నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు.
ఇక మరోసారి అదే టీమ్ కి ఆడుతుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ధోని అశ్విన్ ల మధ్య అప్పట్లో చాలా మంచి బాండింగ్ అయితే ఉండేది. మరోసారి ఆ బాండింగ్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలూస్తోంది…
ఇక ఐపిఎల్ 2025 కి మరొక 4 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఆయన ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో ఇండియన్ టీమ్ కి ఇన్ని సంవత్సరాల పాటు సేవలను అందించిన అశ్విన్ ను ఒక లెజెండరీ దిగ్గజ స్పిన్నర్ అని సంభోదించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…